Return to Video

కనుమరుగవుతున్న కప్పలు - కెర్రీ క్రిగేర్

  • 0:07 - 0:09
    మీరు ఎప్పుడైనా రాత్రి పూట కప్పల యొక్క
  • 0:09 - 0:10
    బెక బెకలు విన్నారా?
  • 0:10 - 0:12
    కొన్ని వందల, మిలియన్ సంవత్సరాల నుంచి
  • 0:12 - 0:15
    ఈ బెక బెకల లాలిపాట రాత్రి పూట గాలిని నింపుతుంది.
  • 0:15 - 0:17
    కానీ ఇటీవల అధ్యయనాలు,
  • 0:17 - 0:18
    కప్ప జాతి అంతరించి పోవటానికి సమీపిస్తుందని
  • 0:18 - 0:20
    సూచిస్తున్నాయి
  • 0:20 - 0:22
    గత కొన్ని దశాబ్దాలుగా,
  • 0:22 - 0:26
    ప్రపంచవ్యాప్తంగా, ఉభయచరాల జనాభా వేగంగా కనుమరుగవుతుంది
  • 0:26 - 0:28
    సుమారు మూడింట ఒక వంతు ప్రపంచ ఉభయచరాల జాతులు
  • 0:28 - 0:30
    అంతరించిపోయే అపాయంలో ఉన్నాయి
  • 0:30 - 0:33
    మరియు 100 కు పైగా జాతులు ఇప్పటికే కనుమరుగైయ్యాయి
  • 0:33 - 0:35
    చింతించాల్సిన విషయం లేదు. ఇంకా ఆశ మిగిలే ఉంది
  • 0:35 - 0:37
    కప్పల్ని ఎలా కాపాడాలో తెలుసుకొనే ముందు
  • 0:37 - 0:39
    ముందు మనం అవి ఎందుకు
  • 0:39 - 0:40
    అంతరించి పోతున్నాయో తెలుసుకుందాము
  • 0:40 - 0:43
    ఎందుకు వాటిని చుట్టూ ఉంచడం ముఖ్యమైనదో చూద్దాం
  • 0:43 - 0:45
    ప్రపంచం నలుమూలల ఉన్న కప్పలకు
  • 0:45 - 0:47
    నివాస నాశనం అతిపెద్ద సమస్యగా చెప్పవచ్చు
  • 0:47 - 0:50
    భూమి మీద ఏడు బిలియన్ మంది మనుషులు జీవిస్తున్నారు
  • 0:50 - 0:52
    మనము నివాసాల కోసం కప్పలతో పోటిపడుతున్నాము
  • 0:52 - 0:54
    కప్ప నివాసాల పైన
  • 0:54 - 0:56
    అడవులని నరికి
  • 0:56 - 0:57
    చిత్తడినేలలు హరించి
  • 0:57 - 0:58
    పలు ఉభయచరాల, ఆవాసాలను హరించి
  • 0:58 - 0:59
    వాటి మీద మనము
  • 0:59 - 1:02
    పట్టణాలు, పొలాలు, ఊళ్ళను నిర్మిస్తున్నాము
  • 1:02 - 1:04
    వాతావరణ మార్పు అవపాతన స్థాయిలను మార్చివేస్తుంది
  • 1:04 - 1:08
    చెరువులు, ప్రవాహాలు, ఆరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది
  • 1:08 - 1:10
    భూమి మీద మానవ జనాభా పెరిగే కొద్ది
  • 1:10 - 1:13
    అన్నే ముప్పులను ఉభయచరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • 1:13 - 1:15
    కప్ప జాతి అంతరించిపోవటానికి ఇంకా
  • 1:15 - 1:17
    వివిధ రకములైన కారణాలున్నాయి
  • 1:17 - 1:19
    పెంపుడు జంతువుల మరియు వాణిజ్య ఆహారం కోసం అదిఖంగా సాగు చేయటం వల్ల
  • 1:19 - 1:21
    ప్రతి యేటా ఎన్నో లక్షల కప్పలు
  • 1:21 - 1:23
    తమ నివాసాల్ని కోల్పోతున్నాయి
  • 1:23 - 1:24
    స్థానిక ట్రౌట్ మరియు క్రాఫిష్
  • 1:24 - 1:26
    వంటి బలమైన జాతులు
  • 1:26 - 1:28
    కప్పల్ని ఆహారంగా తింటాయి
  • 1:28 - 1:29
    మానవులు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా
  • 1:29 - 1:31
    100 మిలియన్ కు పైగా ఉభయచరాలను
  • 1:31 - 1:33
    ఎగుమతి దిగుమతులు చేసుకొనే ప్రక్రియ
  • 1:33 - 1:35
    అంటు వ్యాధుల వ్యాప్తికి దోహదపడుతుంది
  • 1:35 - 1:37
    వీటిని ఆహారముగా, పెంపుడు జంతువులుగా, ఎరగా, ఉపయోగించేందుకు
  • 1:37 - 1:38
    మరియు ప్రయోగశాలల్లో మరియు జంతుప్రదర్శనశాలల్లో వాడుతున్నాము
  • 1:38 - 1:41
    బహుకొద్ది నిబంధనలతో మరియు వ్యాధులతో ఉన్న జీవుల్ని సరిగ్గా వెలివేయకపోవటం వలన
  • 1:41 - 1:43
    chytridiomycosis అనే
  • 1:43 - 1:44
    ఒక రోగం
  • 1:44 - 1:47
    జల స్రవంతులలో నివసించే ఉభయచరాల జనాభాను
  • 1:47 - 1:48
    ఆఫ్రికాలో
  • 1:48 - 1:49
    ఆస్ట్రేలియా లో
  • 1:49 - 1:49
    యూరోప్ లో
  • 1:49 - 1:50
    ఉత్తర, మధ్య, మరియు దక్షిణ అమెరికాలలో.
  • 1:50 - 1:52
    అంతరించిపోవుటకు కారణమైనది
  • 1:52 - 1:54
    ఈ సమస్యలు పైన
  • 1:54 - 1:57
    మనము వందల మిలియన్ల కిలోగ్రాముల పురుగుమందులు
  • 1:57 - 1:59
    పర్యావరణానికి ప్రతి ఏట చేరుస్తున్నాము
  • 1:59 - 2:01
    వాటిల్లో ఉండే రసాయనాలను, ఉభయచరాల యొక్క
  • 2:01 - 2:03
    చర్మం అతిసులువుగా గ్రహిస్తాయి
  • 2:03 - 2:05
    దీనివల్ల రోగనిరోధకశక్తి అణచివేత
  • 2:05 - 2:06
    లేదా ఒక బలహీన రోగ నిరోధక వ్యవస్థ,
  • 2:06 - 2:08
    అభివృద్ధి వైకల్యాలు కలుగుతాయి
  • 2:09 - 2:11
    మనకు కప్పలవల్ల
  • 2:11 - 2:12
    ఏదైనా లాభము ఉన్నదా?
  • 2:12 - 2:15
    కప్పల సమూహము మనకు బహు ముఖ్యము
  • 2:15 - 2:17
    అవి ఆహార పిరమిడ్ యొక్క ఒక అంతర్భాగం.
  • 2:17 - 2:19
    అవి కీటకాలు, పేలు, దోమలు,
  • 2:19 - 2:20
    ఇతర వ్యాధికారక క్రిములను తినటం
  • 2:20 - 2:23
    వలన మలేరియా నుండి
  • 2:23 - 2:24
    డెంగ్యూ జ్వరం నుండి,
  • 2:24 - 2:25
    మరియు ఇతర అనారోగ్యాలు రాకుండా రక్షించడంలో తోడ్పడుతున్నాయి
  • 2:25 - 2:27
    శైవలాలను పై ఆధారపడి బ్రతకడం ద్వారా జలమార్గాలు శుభ్రంగా ఉంచడంలో
  • 2:27 - 2:28
    తలకప్పలు తోడ్పడుతున్నాయి
  • 2:28 - 2:29
    వడపోత వ్యవస్థలో మనకు అయ్యే
  • 2:29 - 2:31
    భారీ ఖర్చును తగ్గిస్తున్నాయి
  • 2:31 - 2:34
    మనకు నీటికి అయ్యే ఖర్చును తగ్గిస్తున్నాయి
  • 2:34 - 2:36
    కప్పలు - పక్షులు, చేపలు, పాములు, తూనీగ, మరియు కోతులకు సైతం,
  • 2:36 - 2:39
    ఆహారంగా ఉపయోగపడతాయి
  • 2:39 - 2:41
    కప్పలు అంతరించి పోతే
  • 2:41 - 2:42
    ఆహార పిరమిడ్ సమతుల్యం దెబ్బతిని,
  • 2:42 - 2:45
    మిగిలిన జాతులు కూడా అంతరించి పోగలవు
  • 2:45 - 2:47
    వైద్యశాస్త్రం పురోగతికి కూడా
  • 2:47 - 2:49
    ఉభయచరాలు చాలా ముఖ్యమైనవి
  • 2:49 - 2:51
    శరీరధర్మ శాస్త్రం మరియు వైద్యశాస్త్రంలో
  • 2:51 - 2:52
    పది శాతం కంటే ఎక్కువ, నోబెల్ బహుమతులు
  • 2:52 - 2:53
    ఉభయచర జంతువులపై పరిశోధనలు
  • 2:53 - 2:56
    జరిపిన వారు దక్కించుకున్నారు.
  • 2:56 - 2:58
    కప్ప చర్మం మీద ఉండే కొన్ని
  • 2:58 - 3:00
    ఎమైనో ఆమ్లములు గల అణువులు , HIVని చంపగలవు
  • 3:00 - 3:02
    బాధను ఉపసమింపగలవు
  • 3:02 - 3:05
    మరియు సహజంగా దోమల నిరోధకారిగా ఉపయోగపడతాయి
  • 3:05 - 3:07
    మనమింకా అనేక ఆవిష్కరణలు
  • 3:07 - 3:08
    కప్పల్ని కాపాడుకోవడం ద్వారా సాదింపవచ్చు
  • 3:08 - 3:10
    కాని కప్పలే కనక మాయమైతే
  • 3:10 - 3:12
    ఆరోగ్యరంగంలో పురోగతిపై
  • 3:12 - 3:14
    మనం పెట్టుకున్న ఆశలు అడియసలవుతాయి
  • 3:14 - 3:16
    అదృష్టవశాత్తూ, కప్పల్ని సంరక్షించుకొనటానికి పలు మార్గాలు ఉన్నాయి
  • 3:16 - 3:18
    ప్రారంభించడానికి ఉత్తమంగా
  • 3:18 - 3:20
    మన దినచర్యల్ని జీవ్యావరణ అడుగుజాడలు మెరుగుపరిచే
  • 3:20 - 3:22
    విధంగా కృషి చేయాలి
  • 3:22 - 3:24
    మరెప్పుడైన ఆ బెకబెకలు విన్నప్పుడు,
  • 3:24 - 3:27
    ఇబ్బందిపెట్టె రణగొణ ధ్వనిగా కాకుండా,
  • 3:27 - 3:28
    పరిపూర్ణ సామరస్యంతో సహాయం కోసం
  • 3:28 - 3:31
    అర్థించే ఒక పిలుపుగా పరిగణించండి.
Title:
కనుమరుగవుతున్న కప్పలు - కెర్రీ క్రిగేర్
Description:

పూర్తి పాఠం వీక్షించేందుకు: http://ed.ted.com/lessons/disappearing-frogs-kerry-m-kriger

ప్రపంచవ్యాప్తంగా కప్పలు (మరియు సాధారణంగా ఉభయచరాలు) ప్రమాదంలో ఉన్నాయి -, సుమారు మూడింట ఒక వంతు ప్రపంచ ఉభయచర జాతులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనకు కప్పలు అనేక విధములుగా సహాయపడుతున్నాయి. ఈ పాఠం ద్వారా కెర్రీ క్రిగేర్ కప్పల కష్టాలను వివరిస్తూ, వాటిల్ని మనం ఎలా పరిరక్షిన్చుకోవచ్చో చెబుతున్నారు

కెర్రీ క్రిగేర్ ద్వారా పాఠం. సైమన్ అమ్పెల్ ద్వారా యానిమేషన్.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TED-Ed
Duration:
03:48
Dimitra Papageorgiou approved Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Sandeep Kumar Reddy Depa accepted Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Sandeep Kumar Reddy Depa commented on Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Sandeep Kumar Reddy Depa edited Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Sandeep Kumar Reddy Depa edited Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Samrat Sridhara edited Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Samrat Sridhara edited Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Samrat Sridhara edited Telugu subtitles for Disappearing frogs - Kerry M. Kriger
Show all

Telugu subtitles

Revisions

  • Revision 7 Edited (legacy editor)
    Sandeep Kumar Reddy Depa