Return to Video

మీరు వాడే పదాలే మీ భవిష్యత్ మానసికారోగ్యాన్ని నిర్ణయిస్తాయి

  • 0:01 - 0:06
    ప్రాచీన గ్రీకుల వస్త్రధారణను గురించిన
    చారిత్రక ఆధారాలు మనకున్నాయి
  • 0:06 - 0:07
    వారి జీవన విధానం గురించి,
  • 0:07 - 0:09
    యుధ్దపటిమను గూర్చి కూడా
  • 0:09 - 0:11
    కానీ వాళ్ళెలా ఆలోచించేవారో
    తెలీదు
  • 0:11 - 0:16
    ఒక ఊహ ప్రకారం మానవుని
    ఆలోచనా తీవ్రత అంటే
  • 0:16 - 0:18
    మన ఊహా బలమే
  • 0:18 - 0:19
    జాగరూకతతో వుండడం ,
  • 0:19 - 0:20
    కలలుకనడం
  • 0:20 - 0:22
    రెండూ ఎప్పుడూ ఒకేలా వుంటాయి
  • 0:23 - 0:24
    ఇంకో సంభావ్యత ఏంటంటే
  • 0:24 - 0:28
    సాంఘిక మార్పులే మన సంస్కృతిని రూపొందించాయి
  • 0:28 - 0:32
    అవి మన ఆలోచనా పరిధిని సైతం మార్చాయి
  • 0:33 - 0:35
    దీన్ని గూర్చి మనకు భిన్నాభిప్రాయాలున్నాయి
  • 0:35 - 0:38
    నిజానికివి చిరకాలంనుండీ
    వస్తున్నతాత్విక చర్చలే
  • 0:39 - 0:41
    ఈ ప్రశ్నకు సైన్సు ద్వారా జవాబు పొందగలమా
  • 0:43 - 0:45
    ఇక్కడ నేనొక టి ప్రతిపాదిస్తున్నాను
  • 0:45 - 0:50
    ప్రాచీన గ్రీకు నగరాలను అప్పుడున్నట్లు
    మనం పునర్నిర్మించుకోవాలి
  • 0:50 - 0:53
    కేవలం ఇటుకల ఆధారంగా
  • 0:53 - 0:57
    సంస్కృతీ రచనలంటే ఆర్కియలాజికల్ రికార్డ్సే
  • 0:57 - 0:59
    ఇవి మానవ భావనలనే శిలాజాలు
  • 1:00 - 1:01
    నిజానికి
  • 1:01 - 1:03
    ఇదొక రకమైన మానసిక విశ్లేషణ
  • 1:03 - 1:07
    మానవ సంస్కృతికి మూలమైన
    ప్రాచీన గ్రంథాలకు సంబంధించినది
  • 1:07 - 1:13
    70 వ దశకంలో జులియన్ జేన్స్ చెప్పాడు
    ఇది స్థూలమైన హేతుబధ్ద పరికల్పన అని
  • 1:13 - 1:15
    కేవలం 3 వేల సంవత్సరాలక్రితం
  • 1:15 - 1:20
    మనమిప్పుడు స్కిజో ఫెర్నిక్స్
    అంటున్నదశలో వుండేవారు
  • 1:22 - 1:23
    అతనీ నిర్ణయానికెలా వచ్చాడంటే
  • 1:23 - 1:27
    ఈ గ్రంథాలలో తొలి మానవులను గూర్చి
    చెప్పిన నిజాల ఆధారంగా
  • 1:27 - 1:29
    వారు నిలకడగా స్థిరంగా ప్రవర్తించేవారు
  • 1:29 - 1:32
    ప్రపంచంలోని వివిధప్రాంతాలలో,
    విభిన్న సంప్రదాయాలలో
  • 1:32 - 1:35
    అజ్ఞాత వాణులను వింటున్నట్లు,
    పాటిస్తున్నట్లు
  • 1:35 - 1:38
    వారు దీన్ని భగవంతుని పలుకులుగా భావించేవారు
  • 1:38 - 1:39
    లేదా విద్యాధి దేవత నుంచి
  • 1:40 - 1:43
    వీటినే నేడు మనం భ్రాంతి అంటున్నాం
  • 1:44 - 1:47
    అలా కాలం గడిచేకొద్దీ
  • 1:47 - 1:50
    వారు గుర్తించారు అవి సృష్టి కర్తలవనీ
  • 1:50 - 1:53
    ఆ కంఠాలు వారివేననీ
  • 1:53 - 1:56
    దీంతో వారు ఆత్మావలోకనం సాగించారు
  • 1:56 - 1:59
    అంటే భావాలను గురించి
    ఆలోచించే సామర్థ్యాన్ని పొందడం
  • 2:00 - 2:03
    జేన్స్ సిధ్ధాంతం ప్రకారం అంతశ్చేతన
  • 2:03 - 2:06
    అంటే మనమీరోజుల్లో గ్రహించే విధానంలో
  • 2:06 - 2:10
    మన అస్తిత్వానికి మనమే మార్గదర్శులమనేది
  • 2:10 - 2:13
    ఈ మధ్య కాలంలో వచ్చిన సాంస్కృతిక అభివృధ్ధి
  • 2:13 - 2:15
    ఈ సిధ్ధాంతం చాలా అద్భుతమైనది
  • 2:15 - 2:17
    కానీ ఇందులో ఒక సమస్య దాగివుంది
  • 2:17 - 2:21
    ఇది కేవలం ప్రత్యేక ఉదాహరణలకు
    మాత్రమే పరిమితమైంది
  • 2:21 - 2:23
    ప్రశ్న ఏంటంటే ఈ సిధ్ధాంతం ప్రకారం
  • 2:23 - 2:28
    చరిత్రలో అంత శ్శోధన కేవలం 3 వేల సంవ.
    క్రితమే మొదలయ్యింది
  • 2:28 - 2:31
    దీన్ని లక్ష్యాత్మక , గుణాత్మక విధానంలో
    పరీక్షించగలం
  • 2:32 - 2:35
    దీన్ని ఎలా సాధించగలం అనేది వ్యక్తమే
  • 2:35 - 2:39
    ఇది ప్లేటో ఒక రోజు నిద్రలేచాక
    రాసినటు వంటిది కాదు
  • 2:39 - 2:40
    హలో నేను ప్లేటోను
  • 2:40 - 2:43
    ఈ రోజుతో నాలో చైతన్యం పూర్తిగా వచ్చేసింది
  • 2:43 - 2:46
    ( నవ్వులు )
  • 2:46 - 2:49
    ఇది సమస్య స్వభావాన్ని వివరిస్తుంది
  • 2:49 - 2:54
    ఎవ్వరూ చెప్పని ఒక కాన్సెప్ట్ నుంచి ఎలా
    బయటికి రావాలో దారి వెదకాలి
  • 2:54 - 2:59
    ఇంట్రాస్పెక్షన్ అనేది ఒక్కసారి
    కూడా కనిపించలేదు
  • 2:59 - 3:01
    మనం పరిశీలించాలనుకున్న గ్రంథాలలో
  • 3:02 - 3:06
    మన పధ్ధతిలో దీన్ని సాధించాలంటే, పదాల
    మధ్య తావును ఏర్పాటు చేయాలి
  • 3:07 - 3:10
    అది ఎంత విశాలమంటే అన్ని పదాలకూ చోటుండాలి
  • 3:10 - 3:13
    ఎలా అంటే రెండు పదాల మధ్య దూరం
  • 3:13 - 3:16
    అవి ఎంతదగ్గర సంబంధాన్ని కలిగివున్నవో
    సూచించగలగాలి
  • 3:16 - 3:18
    ఉదాహరణకు
  • 3:18 - 3:21
    మీరు dog, cat అనే పదాలు చాలా దగ్గరగా
    రావాలనుకుంటారు
  • 3:21 - 3:24
    కానీ గ్రేప్ ఫ్రూట్,లాగరిథం అనే పదాలు
    చాలా దూరంలో వున్నాయి
  • 3:25 - 3:29
    ఆస్థలంలో ఏ రెండు పదాలకైనా ఇదే పరిస్థితి
  • 3:30 - 3:33
    పదాల కోసం స్థలాన్ని ఏర్పాటు చేయడానికి
    ఎన్నో మార్గాలున్నాయి
  • 3:33 - 3:35
    నిపుణులను సంప్రదించడం అందులో ఒకటి
  • 3:35 - 3:37
    మనం నిఘంటువుల్లో వెతికినట్లుగా
  • 3:37 - 3:38
    మరో మార్గం ఏంటంటే
  • 3:38 - 3:42
    ఒకవేళ రెండు పదాలమధ్య సంబంధమున్నప్పుడు
    ఏం చేయచ్చంటే
  • 3:42 - 3:44
    అవి ఒకే రకమైన వాక్యాల్లో వస్తాయి
  • 3:44 - 3:46
    ఒకే పేరాల్లో కూడా
  • 3:46 - 3:48
    ఒకే డాక్యుమెంటులోనూ
  • 3:48 - 3:51
    మనం ఊహించిన దానికంటే ఎక్కునసార్లు
  • 3:52 - 3:54
    ఈ సరళమైన పరికల్పన
  • 3:54 - 3:56
    సులభ పధ్ధతిలో
  • 3:56 - 3:57
    కొన్ని చిట్కాల సహాయంతో
  • 3:57 - 3:59
    ఆ పని చేయాలి
    అయితే నిజం ఏంటంటే
  • 3:59 - 4:02
    ఇది చాలా సంక్లిష్టమైనది
    ,హైడేమెన్షనల్ తావును కూడా
  • 4:02 - 4:03
    ప్రభావవంతంగా మార్చేస్తుంది
  • 4:04 - 4:07
    ఇదెంత బాగా పని చేస్తుందో చెప్పాలంటే
  • 4:07 - 4:11
    కొన్ని పరిచిత పదాలను పరిశీలిస్తే
    ఈ ఫలితాలను మనం చూడొచ్చు
  • 4:12 - 4:13
    మొదటగా మీరు చూస్తారు
  • 4:13 - 4:16
    పదాలు వాటంతటఅవే శబ్దార్థాలుగా
    వ్యవస్థీకృతమౌతాయి
  • 4:16 - 4:18
    అలా మీరు పళ్లను,శరీరభాగాలను పొందుతారు
  • 4:18 - 4:21
    కంప్యూటర్ భాగాలు,సాంకేతికభాగాలు మొదలైనవి
  • 4:21 - 4:25
    మనం భావాలను శ్రేణిగా అమరుస్తామని
    అల్ గోరిధం గుర్తిస్తుంది
  • 4:26 - 4:27
    ఒకలా చెప్పాలంటే
  • 4:27 - 4:31
    సాంకేతిక పదాలు రెండుభాగాలుగా వుంటాయని
    మీకు తెలుసు
  • 4:31 - 4:33
    అంటే అస్ట్రొనామిక్ , మరియు భౌతిక పదాలుగా
  • 4:33 - 4:36
    తర్వాత మరింత ఉపభాగాలుగా
  • 4:36 - 4:37
    ఉదాహరణకు అస్ట్రానమీ అనే పదం
  • 4:37 - 4:40
    దీన్ని గురించి ఆలోచిస్తే కాస్త
    గజిబిజిగా అన్పిస్తుంది
  • 4:40 - 4:41
    ఇది నిజానికి ఉండాల్సిన దగ్గరే
  • 4:41 - 4:43
    దేని మధ్య ఉండాలో
  • 4:43 - 4:44
    అదే నిజమైన సైన్స్
  • 4:44 - 4:46
    ఆ మధ్యలో ఇది వివరించేది
  • 4:46 - 4:47
    అస్ట్రొనామికల్ పరిభాషను
  • 4:48 - 4:50
    మనం దీంతో అలా వెళ్లి పోవచ్చు
  • 4:50 - 4:52
    నిజానికి మీరొక్కక్షణం ఆగి ఆలోచిస్తే
  • 4:52 - 4:54
    అనియత ట్రాజెక్టరీలను సృష్టించొచ్చు
  • 4:54 - 4:57
    దీన్ని మీరో పద్యరచనగా భావిస్తారు
  • 4:58 - 5:00
    ఒకరకంగా ఇది నిజమే
  • 5:00 - 5:03
    అంతరిక్షంలో ప్రయాణం అంటే
    మనోవీధులలో సంచరించడమే
  • 5:04 - 5:06
    చివరగా మరోమాట
  • 5:06 - 5:10
    ఈ అల్ గోరిథం మన ఇంట్యూషన్లను
    కూడా గుర్తిస్తుంది
  • 5:10 - 5:14
    మన ఆత్మ పరిశీలనకు దారితీసే పదాలుగా
    ఏవుండాలో కూడా
  • 5:14 - 5:15
    ఉదాహరణకు
  • 5:15 - 5:19
    సెల్ఫ్, గిల్ట్ , రీజన్ ,ఎమోషన్ వంటి పదాలు
  • 5:19 - 5:21
    ఆత్మపరిశీలనకు చాలా దగ్గరగా వుంటాయి
  • 5:21 - 5:22
    కానీ ఇతర పదాలు
  • 5:22 - 5:24
    ఉదా.రెడ్ , ఫుట్ బాల్ ,క్యాండిల్ , బనానా
  • 5:24 - 5:26
    వంటివి చాలా దూరంలో వుంటాయి
  • 5:26 - 5:29
    ఒకసారి గనుక మనం స్పేస్ ను ఏర్పరిస్తే
  • 5:29 - 5:32
    ఆత్మపరిశీలనా చరిత్ర అనే ప్రశ్న
  • 5:32 - 5:34
    లేదా ఇంకేదైనా కాన్సెప్ట్ యొక్క చరిత్ర
  • 5:34 - 5:39
    ఇంతవరకు అమూర్తంగానూ, సందిగ్దంగానూ వున్నది
  • 5:39 - 5:40
    యదార్థంగా మారడంతో
  • 5:40 - 5:43
    గుణాత్మక సైన్స్ కు అనుకూలంగా మారుతుంది
  • 5:44 - 5:47
    మనం చేయాల్సిందేంటంటే పుస్తకాలను తీసుకుని
  • 5:47 - 5:48
    వాటిని డిజిటలైజ్ చేయాలి
  • 5:48 - 5:51
    ఈ పదప్రవాహాన్ని ట్రాజెక్టరీ లా మార్చి
  • 5:51 - 5:53
    దాన్ని స్పేస్ లో ప్రవేశపెట్టాలి
  • 5:53 - 5:57
    అప్పుడు ఈ ట్రా జెక్టరీ ప్రభావం ఎంత అనీ
  • 5:57 - 6:00
    ఆత్మపరిశీలన కు సన్నిహితంగా గుర్కించాలి
  • 6:01 - 6:02
    దీని సహాయంతో
  • 6:02 - 6:04
    ఆత్మపరిశీలనా చరిత్రను అంచనా వేయొచ్చు
  • 6:04 - 6:06
    ప్రాచీన గ్రీకు సంప్రదాయంలోని
  • 6:06 - 6:09
    శ్రేష్టమైన లిఖిత ప్రమాణాలు మన దగ్గరున్నాయి
  • 6:10 - 6:12
    మేము అన్ని పుస్తకాలనూ తీసుకుని
  • 6:12 - 6:14
    వాటిని కాలక్రమాను సారంగా పేర్చాము
  • 6:14 - 6:16
    ప్రతి పుస్తకంలోంచి పదాలను తీసుకుని
  • 6:16 - 6:18
    వాటిని స్పేస్ లో ప్రదర్శించాము
  • 6:18 - 6:21
    ప్రతి పదమూ ఆత్మ పరిశీలనకు ఎంత దగ్గరగా
    వుందో పరిశీలించాము
  • 6:21 - 6:22
    దాని సరాసరి గ్రహించి
  • 6:23 - 6:26
    కాలం గడిచేకొద్దీ దాని మళ్లీ పరిశీలించాము
  • 6:26 - 6:29
    ఈ పుస్తకాలు మరీ దగ్గరయ్యాయి
  • 6:29 - 6:31
    ఆత్మ పరిశీలన అనే కాన్సెప్ట్ కు
  • 6:31 - 6:35
    ప్రాచీన గ్రీకు సంస్కృతి లోనూ
    ఇలానే జరిగింది
  • 6:36 - 6:39
    దీన్ని మీరు హోమరిక్ సంప్రదాయంలోనూ చూడొచ్చు
  • 6:39 - 6:42
    ఇవి ఆత్మపరిశీలనకు దగ్గరవడంలో కొంత
    అభివృధ్ధి కన్పించింది
  • 6:42 - 6:44
    కానీ క్రీస్తుకు దాదాపు 400 సంవ క్రితం
  • 6:45 - 6:49
    దీని ప్రభావం 5 రెట్లు పెరిగింది
  • 6:49 - 6:52
    దాంతో పుస్తకాలు మరింత దగ్గరయ్యాయి
  • 6:52 - 6:53
    ఆత్మపరిశీలన అనే కాన్సెప్ట్ కు
  • 6:54 - 6:57
    దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయమేంటంటే
  • 6:57 - 6:58
    ఇప్పుడు మనం అడగొచ్చు
  • 6:58 - 7:02
    ఇది నిజంగా వేరైన స్వతంత్ర సంప్రదాయమేనా అని
  • 7:03 - 7:06
    ఈ విశ్లేషణను జూడో క్రిస్టి యన్
    సంప్రదాయానికి అనువర్తిస్తే.
  • 7:06 - 7:09
    సరిగ్గా ఇలాంటి జవాబే వచ్చింది
  • 7:10 - 7:14
    అలాగే old testament లోని పాతపుస్తకాల్లో
    కొంత శాతం పెరిగింది
  • 7:14 - 7:16
    ఆ తర్వాత ఇది మరింత వేగంగా విస్తరించింది
  • 7:16 - 7:18
    New Testament లోని క్రొత్తపుస్తకాలలో
  • 7:18 - 7:20
    ఆత్మపరిశీలనా శిఖరాగ్రాలను మనం
  • 7:20 - 7:22
    సెయింట్ అగస్టీన్ కన్ఫెషన్లలో చూస్తాము
  • 7:22 - 7:24
    ఇవి క్రీస్తుకు 4 శతాబ్దాల తరువాతివి
  • 7:25 - 7:27
    ఇవి చాలా ముఖ్యమైనవి కూడా
  • 7:27 - 7:30
    ఎందుకంటే సెయింట్ అగస్టీన్ ను పండితులు ,
  • 7:30 - 7:32
    భాషావేత్తలు , చరిత్రకారులు గుర్తించారు
  • 7:32 - 7:35
    ఆత్మపరిశీలనా సిధ్ధాంతానికి మూలపురుషునిగా
  • 7:35 - 7:38
    నిజానికి కొందరితనిని ఆధునిక సైకాలజీ
    పితగా భావిస్తారు
  • 7:39 - 7:41
    అలాగే మన అల్ గోరిథం కూడా
  • 7:41 - 7:44
    అందులో గుణాత్మకత వుంది
  • 7:44 - 7:45
    ఇది లక్ష్యాత్మకమైంది కూడా
  • 7:45 - 7:47
    చాలా వేగవంతమైంది కూడా
  • 7:47 - 7:49
    కేవలం లిప్తకాలంలో పనిచేస్తుంది
  • 7:49 - 7:53
    చాలా ముఖ్యమైన కంక్లూషన్లను పట్టుకోగలదు
  • 7:53 - 7:55
    ఈ దీర్ఘకాల పరిశోధనా సంప్రదాయాల
  • 7:56 - 8:00
    ఒక రకంగా ఇది సైన్స్ యొక్క సౌలభ్యత కూడా
  • 8:00 - 8:03
    ఇప్పుడీ ఆలోచనను ఇలా కూడా మార్చుకోవచ్చు
  • 8:03 - 8:06
    సాధారణీకరణతో పలురంగాలుగా విభజించవచ్చు
  • 8:07 - 8:12
    గతకాలపు మానవ చేతనను గూర్చి
    మనం ఆలోచించినట్లుగానే
  • 8:12 - 8:15
    మనల్ని మనం ప్రశ్నించుకునే చివరి
    ప్రశ్న ఇదేకావచ్చు
  • 8:15 - 8:19
    భవిష్యత్తులో మనం మన చేతనను
    గూర్చి చెప్పగలమేమో
  • 8:20 - 8:21
    క్లుప్తంగా చెప్పాలంటే
  • 8:21 - 8:23
    మనమీరోజు పలికే పలుకులే
  • 8:23 - 8:29
    ఇంకొన్ని రోజుల్లో మన మనస్సెలా
    మారుతుందో చెప్తాయి
  • 8:29 - 8:30
    కొన్ని నెలల్లో
  • 8:30 - 8:31
    నేటి నుండి కొన్ని
    సంవత్సరాల తర్వాత
  • 8:32 - 8:35
    ఇప్పుడు మనం వాడుతున్న సెన్సార్లే
  • 8:35 - 8:36
    హృదయస్పందనలను గుర్తిస్తాయి
  • 8:36 - 8:38
    మన శ్వాసప్రక్రియనూ
  • 8:38 - 8:39
    మన జీన్లనూ
  • 8:39 - 8:43
    ఇది మనకు రోగనివారణలో ఉపయోగపడవచ్చు
  • 8:43 - 8:47
    మనం మాట్లాడే పదాలను
    నియంత్రించవచ్చు ,విశ్లేషించవచ్చు
  • 8:47 - 8:49
    మనం ట్వీట్ ,ఈ మెయిల్ , చేయవచ్చు, రాయవచ్చు
  • 8:49 - 8:54
    మనస్సులో జరిగే సంఘర్షణను
    ముందుగా తెలుసుకోవచ్చు
  • 8:55 - 8:57
    గులెర్మో సీచి
  • 8:57 - 9:00
    ఈ సాహసకృత్యంలో నాకు తోడుగా వున్నాడు
  • 9:00 - 9:01
    మేమీ కృత్యాన్ని గ్రహించాము
  • 9:02 - 9:08
    34మంది యువకుల ఉపన్యాసాలను
    రికార్డ్ చేసి విశ్లేషించాము
  • 9:08 - 9:11
    వారికి స్కిజోఫెర్నియా వచ్చే
    అవకాశాలు మెండుగావున్నాయి
  • 9:11 - 9:14
    మేమేం చేసామంటే మొదటి రోజు
    ఉపన్యాసాల్ని మాపనం చేసాము
  • 9:14 - 9:18
    వాటిలోని అంశాల ద్వారా భావిసూచనలను
    తెలుసుకోగలమా అని ప్రశ్నించాము
  • 9:18 - 9:20
    దాదాపు 3 సంవ కాలంలో
  • 9:20 - 9:22
    సైకోసిస్ యొక్క భావి పోకడలను
  • 9:23 - 9:26
    కానీ మా అంచనాలకు వ్యతిరేకంగా
  • 9:26 - 9:29
    మేము మళ్ళీమళ్లీ ఫెయిల్ అయ్యాము
  • 9:30 - 9:34
    సెమాటిక్స్ లో కావలసినంత సమాచారం లేదు
  • 9:34 - 9:36
    మానసిక సంతులనంపై భవిష్యత్ అంచనాలగురించి
  • 9:37 - 9:38
    ఈ సమాచారం సరిపోతుంది
  • 9:38 - 9:43
    నియంత్రణ,స్కిజోఫెర్నియా వున్న గ్రూపుల
    మధ్య తేడాలు తెలుసుకోడానికి
  • 9:43 - 9:45
    కొంతవరకు ప్రాచీన గ్రంధాల
    పధ్ధతిలోనే సాగాము
  • 9:45 - 9:48
    ఈ సైకోసిస్ ఆధారంగా భవిష్యత్తును ఊహించలేము
  • 9:49 - 9:51
    అప్పుడు వాస్తవాన్ని మేం గుర్తించాము
  • 9:51 - 9:55
    వారు చెప్తున్నది అంత ముఖ్యమైన
    విషయం కాకపావచ్చని
  • 9:55 - 9:57
    కానీ వారు చెప్పే విధానం
  • 9:58 - 9:59
    మరీ ముఖ్యంగా
  • 9:59 - 10:02
    ఈపదాలు ఏ సెమాటిక్ పరిసరాల్లో
    వున్నవనే దానికన్నా
  • 10:02 - 10:04
    ఎంతదూరాన్ని ఎంత వేగంగా ప్రయాణించాయన్నది
  • 10:04 - 10:07
    ఒక మాండలిక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి
  • 10:07 - 10:09
    అందువలన మేమీ మాపనాన్ని ఎంచుకున్నాం
  • 10:09 - 10:11
    దీనికి సెమాటిక్ సమన్వయం అని పేరు పెట్టాం
  • 10:11 - 10:16
    దీంతో సెమాటిక్ విభాగంలోనివ్యక్తీకరణ
    ప్రయత్నాన్ని సులువుగా కొలవచ్చు
  • 10:16 - 10:18
    ఒకే సెమాటిక్ కాటగిరీలో
    ఇలా చేయవచ్చు
  • 10:19 - 10:23
    ఈ వర్గం లోని 34 మంది ఇలా
    పరీక్షించబడ్డారు
  • 10:23 - 10:27
    సెమాటిక్ కొహరెన్స్ గుర్తించగలిగే
    అల్ గోరిథం ఆధారంగా
  • 10:27 - 10:30
    నూరు శాతం ఖచ్చితత్వంతో
  • 10:30 - 10:32
    సైకోసిస్ వున్నవారికి , లేని వారికి
  • 10:33 - 10:36
    ఇది ఒక రకంగా అసాధ్యమైన పని
  • 10:36 - 10:37
    దరిదాపులకుకూడా
  • 10:37 - 10:41
    ప్రస్తుతమున్న అన్ని క్లినికల్
    పధ్ధతులతో కూడా
  • 10:43 - 10:46
    నాకో విషయం స్పష్టంగా గుర్తున్నది
    అప్పుడు నేనీ అంశం పై పని చేస్తున్నాను
  • 10:46 - 10:48
    నా కంప్యూటర్ ముందు కూర్చుని వున్నాను
  • 10:48 - 10:51
    పోలో పంపిన అనేక ట్వీట్లను నేను చూసాను
  • 10:51 - 10:54
    బ్యూనస్ ఐరిస్ లో పోలో నా తొలి విధ్యార్థి
  • 10:54 - 10:56
    అప్పుడతను న్యూయార్క్ లో వుండేవాడు
  • 10:56 - 10:59
    ఈ ట్వీట్లలో ఒక సంగతుంది
  • 10:59 - 11:02
    అందులో స్పష్టంగా చెప్పనందున మీకు
    ఖచ్చితంగా చెప్పలేను
  • 11:02 - 11:04
    కానీ నాకో గొప్పఅనుమానముంది
  • 11:04 - 11:07
    ఎక్కడో ఏదో తప్పుజరుగుతోందని
    నాకో గొప్పఅనుమానం
  • 11:08 - 11:11
    అందువల్ల వెంటనే పోలోకు ఫోన్ చేసాను
  • 11:11 - 11:13
    నిజానికి అప్పుడతని ఆరోగ్యం బాగాలేదు
  • 11:13 - 11:15
    ఈ చిన్న నిజం
  • 11:15 - 11:18
    మాటల అంతరార్ధాన్ని
  • 11:18 - 11:22
    అతని పలుకుల,స్పందనల ద్వారా తెలుసుకోగలిగాను
  • 11:22 - 11:25
    అది సులభమైనది,ప్రభావశీలమైనది
    సహాయకారికూడా
  • 11:26 - 11:28
    మీకీ రోజు చెప్తున్నదేంటంటే
  • 11:28 - 11:30
    అవగాహన విషయంలో మనం చాలా దగ్గరగావచ్చాము
  • 11:30 - 11:34
    మనకున్న ఇంట్యూషన్ లను మార్చుకోవచ్చు
  • 11:34 - 11:36
    మనం పంచుకునే వాటినన్నింటినీ
  • 11:36 - 11:37
    అల్ గోరిథంగా మార్చుకోవచ్చు
  • 11:38 - 11:40
    అలా చేసేటప్పుడు
  • 11:40 - 11:44
    భవిష్యత్తులో పూర్తిగా భిన్నమైన
    మానసిక ఆరోగ్యాన్ని మనం చూడవచ్చు
  • 11:44 - 11:50
    అది లక్ష్యాత్మకమైనది,గుణాత్మకమైనది,
    స్వయంచాలకమైనది కూడా
  • 11:50 - 11:51
    మనం రాసే పదాలయొక్క
    మాట్లాడే మాటల యొక్క
  • 11:51 - 11:53
    ఉదారతను విశ్లేషిస్తుంది
  • 11:53 - 11:54
    ధన్యవాదాలు
  • 11:54 - 12:01
    ( చప్పట్లు )
Title:
మీరు వాడే పదాలే మీ భవిష్యత్ మానసికారోగ్యాన్ని నిర్ణయిస్తాయి
Speaker:
మర్యానో సిగ్ మన్
Description:

మీరు ఇప్పుడు మాట్లాడే విధానం ఆధారంగా సైకోసిస్ దృష్ట్యా భవిష్యత్ లో మీ మానసికస్థితిని అంచనా వేయగలమా?మంత్రముగ్థులను చేసే ఈ ఉపన్యాసంలో ప్రముఖ న్యూరోసైంటిస్ట్ మరియానో సిగ్మన్ ప్రాచీన గ్రీకుల అంతశ్శోధన మూలాలను ఆధారంగా చేసుకుని మనం వాడే పదాలు మన అంతరాంతరాల ఆలోచనా విధానాన్ని ఎలా బయటపెడ్తాయో చెపుతూ, ఆ పదాల ఎంపిక ద్వారా స్కిజోఫెర్నియా లక్షణాలను గుర్తించే విధానం వివరిస్తూ, ముందు కాలంలో మానసికారోగ్యాన్ని విభిన్న కోణాల్లో చూస్తామని అంటారు.ఇది మనం వాడే పదాల అటోమాటిక్ అనాలిసిస్ ,అంతేకాక లక్ష్యాత్మకమైనది,స్వయంతచాలకమైనది కూడా అని ఈ ఉపన్యాసంలో వివరించారు.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
12:14

Telugu subtitles

Revisions