Return to Video

బాల్య వివాహానికి వ్యతిరేకంగా ఒక యోధురాలి బాథ!

  • 0:01 - 0:03
    నేను ఈ రోజు మొదలుపెడుతున్నాను
  • 0:03 - 0:05
    ఒక పద్యాన్ని వినిపించడంతో
  • 0:05 - 0:08
    మలావిలో వుండే నా నేస్తం రాసింది
  • 0:08 - 0:10
    ఎలీన్ పీరీ
  • 0:10 - 0:14
    ఎలీన్ వయస్సు 13 సంవత్సరాలే
  • 0:14 - 0:19
    కానీ మేం రాసి ,కూర్చిన పద్యసంకలనాల్ని
    చదువుతుంటే
  • 0:19 - 0:22
    ఆమె రాసింది నాలో ఆసక్తిని పెంచింది
  • 0:22 - 0:24
    అది చాలా ప్రేరణాత్మకంగావుంది
  • 0:24 - 0:26
    దాన్ని మీకోసం చదువుతాను
  • 0:27 - 0:31
    ఆమె తన కవితకు పెట్టిన పేరు
    నా కోరినప్పుడే నా పెళ్లి
  • 0:31 - 0:33
    ( నవ్వులు )
  • 0:33 - 0:36
    నేను కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాను
  • 0:36 - 0:41
    మా అమ్మ నన్ను పెళ్ళికి బలవంతపెట్టలేదు
  • 0:41 - 0:44
    మా నాన్ననన్ను పెళ్ళి కోసం బలవంతపెట్టలేడు
  • 0:46 - 0:48
    మా మామయ్య , మా అత్తయ్య,
  • 0:48 - 0:51
    నా సోదరుడు కానీ , సోదరికానీ
  • 0:51 - 0:53
    నన్ను పెళ్ళికోసం బలవంతపెట్టలేరు.
  • 0:54 - 0:56
    ఈ ప్రపంచంలో ఎవరూ
  • 0:56 - 1:00
    నన్ను పెళ్ళికి ఒప్పించలేరు
  • 1:00 - 1:02
    నేను కావాలనుకున్నప్పుడే పెళ్ళి చేసుకుంటాను
  • 1:02 - 1:05
    మీరు నన్ను కొట్టినా సరే
  • 1:05 - 1:08
    నా వెంట పడి వేధించినా సరే
  • 1:08 - 1:11
    మీరు నాకు ఎలాంటి చెడు చేసినా సరే
  • 1:11 - 1:14
    నా ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను
  • 1:14 - 1:17
    నా ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను
  • 1:17 - 1:21
    దానికి ముందు నేను బాగా చదువుకోవాలి
  • 1:21 - 1:25
    నేను యుక్త వయస్సు కు రాక ముందు మాత్రం కాదు
  • 1:25 - 1:28
    నా ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను .
  • 1:29 - 1:32
    ఈ కవిత అసందర్భంగా వుండొచ్చు
  • 1:32 - 1:35
    13 సంవత్సరాల బాలిక రాసినట్టిది
  • 1:35 - 1:40
    కాని నేను, ఎలీన్ ఎక్కడినుంచి వచ్చామో
  • 1:40 - 1:44
    ఇప్పుడు మీకు వినిపించిన ఈ కవిత
  • 1:44 - 1:48
    ఒక యోధురాలి బాథ
  • 1:48 - 1:51
    నేను మలావికి చెందిన దాన్ని
  • 1:51 - 1:55
    మలావి నిరుపేద దేశాల్లో ఒకటి
  • 1:55 - 1:58
    చాలా బీదది
  • 1:58 - 2:03
    అక్కడ స్త్రీ పురుష సమానత్వం ప్రశ్నార్థకం
  • 2:03 - 2:05
    ఆ దేశం లో పెరుగుతున్నప్పుడు
  • 2:05 - 2:08
    నా జీవితంలో సొంత నిర్ణయాలను తీసుకోలేను
  • 2:08 - 2:10
    కనీసం అన్వేషించలేను
  • 2:10 - 2:13
    జీవితంలో ని అవకాశాలను
  • 2:13 - 2:16
    నేను మీకో కథ చెప్తాను
  • 2:16 - 2:18
    అది ఇద్దరు వేరు వేరు అమ్మాయిలది
  • 2:18 - 2:22
    ఇద్దరు అందమైన అమ్మాయిలది
  • 2:22 - 2:25
    ఈ బాలికలు ఒకే ఇంటిలో
  • 2:25 - 2:27
    పెరిగారు
  • 2:27 - 2:29
    ఇద్దరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకునేవారు
  • 2:29 - 2:32
    కొన్ని సార్లు దుస్తులను పంచుకునేవారు
  • 2:32 - 2:35
    చివరికి చెప్పులను కూడా
  • 2:35 - 2:40
    కాని వారి జీవితాలు మరోలా ముగిసాయి
  • 2:40 - 2:42
    రెండు భిన్న మార్గాలలో
  • 2:43 - 2:47
    ఇంకో అమ్మాయి మా చిన్న చెల్లెలు
  • 2:47 - 2:52
    మా చిన్న చెల్లెలి వయస్సు 11 ఏళ్ళే
  • 2:52 - 2:54
    ఆమె గర్భవతి అయినప్పుడు
  • 2:56 - 3:00
    ఆది చాలా బాథ కలిగించే విషయం
  • 3:01 - 3:05
    ఇది ఆమెనేకాదు , నన్నూ బాథ పెట్టింది
  • 3:05 - 3:08
    అప్పుడు నేనూ కష్ట పరిస్థితుల్లో వున్నాను
  • 3:08 - 3:12
    అది మా సంస్కృతిలోవుంది
  • 3:12 - 3:15
    మీరు యుక్త వయస్సుకు రాగానే
  • 3:15 - 3:19
    మీరు ఇనీసియేషన్ కాంపులకెళ్ళాల్సి వుంటుంది
  • 3:19 - 3:21
    ఈ ఇనీసియేషన్ కాంపుల్లో
  • 3:21 - 3:25
    మీకు నేర్పుతారు ఒక మగవాడిని
    ఎలా సంతృప్తి పరచాలో
  • 3:25 - 3:27
    అక్కడొక ప్రత్యేకమైన రోజుంటుంది .
  • 3:27 - 3:30
    దాన్ని చాలా ముఖ్యమైన దినంగా పరిగణిస్తారు
  • 3:30 - 3:33
    సమాజం వారొక మనిషిని అద్దెకు తీసుకుంటారు
  • 3:33 - 3:35
    అతను ఆ క్యాంప్ కొస్తాడు.
  • 3:35 - 3:38
    ఆ చిన్నారులతో నిద్రిస్తాడు
  • 3:39 - 3:42
    ఆ చిన్నారుల వేదనను వూహించండి
  • 3:42 - 3:45
    ఇలా ప్రతిరోజూ జరుగుతుంది
  • 3:47 - 3:50
    చాలా మంది బాలికలు గర్భవతులౌతారు
  • 3:50 - 3:53
    చివరికి HIV,AIDS వంటివి సోకుతాయి
  • 3:53 - 3:55
    ఇతర లైంగిక వ్యాథులూ సంక్రమిస్తాయి
  • 3:56 - 4:01
    నా చిన్న చెల్లెలు గర్భవతిగా మిగిలింది
  • 4:01 - 4:05
    ఇప్పుడామె వయస్సు కేవలం 16 సంవత్సరాలే
  • 4:05 - 4:08
    ఇంకా ముగ్గురు పిల్లలతల్లి
  • 4:08 - 4:11
    ఆమె మొదటి పెళ్ళి నిలబడలేదు
  • 4:11 - 4:15
    రెండవది కూడా
  • 4:15 - 4:19
    మరోవైపు ఈ చిన్న పిల్ల
  • 4:19 - 4:21
    ఆమె అద్భుతమైినది
  • 4:21 - 4:23
    ( నవ్వులు )
  • 4:23 - 4:26
    ( చప్పట్లు )
  • 4:28 - 4:30
    ఆమె అద్భుతమైనది అని ఎందుకన్నానంటే
  • 4:30 - 4:33
    ఆమె చాలా మహత్తరమైంది
  • 4:33 - 4:37
    ఆ బాలికను నేనే ( నవ్వులు )
  • 4:37 - 4:40
    నాకు పదమూడేళ్ళ వయస్సులో
  • 4:40 - 4:43
    నేను పెద్దదాన్నయ్యానని చెప్పారు
  • 4:43 - 4:46
    నీకు యుక్త వయస్సొచ్చింది
  • 4:46 - 4:50
    నీవు ఇనీసియేషన్ కాంప్ కెళ్ళాల్సి వుంటుంది
  • 4:50 - 4:53
    ఎందుకు అన్నాను నేను
  • 4:53 - 4:57
    నేను ఈ ఇనీసియేషన్ కాంప్ కెళ్లడంలేదు
  • 4:58 - 5:01
    మీకు తెలుసా ఆడవాళ్ళూ నాతో ఏమనేవారో?
  • 5:01 - 5:05
    నీవో మూర్ఖురాలివి, మొండిదానివి
  • 5:05 - 5:12
    నీవు మన సమాజానికి, వర్గానికి చెందిన
    సంప్రదాయాల్ని గౌరవించవు అవి
  • 5:12 - 5:16
    నేను వద్దన్నాను ఎందుకంటే
    ఎక్కడికెళ్ళాలో తెలుసు కాబట్టి
  • 5:16 - 5:18
    నాకు జీవితంలో ఏం కావాలో తెలుసు
  • 5:20 - 5:23
    ఒక బాలికగా నాకెన్నో కలలున్నాయి
  • 5:24 - 5:28
    నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను
  • 5:28 - 5:30
    భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి
  • 5:30 - 5:32
    నన్నొక న్యాయవాదిగా ఊహించుకుంటున్నాను
  • 5:32 - 5:35
    ఒక పెద్ద కుర్చీలో కూర్చోవాలని
  • 5:35 - 5:37
    అలాంటి ఊహలు ఉండేవి
  • 5:37 - 5:40
    నా మదిలో నిత్యమూ మెదులుతుండేవి
  • 5:40 - 5:42
    నాకు తెలుసు ఒక రోజు
  • 5:42 - 5:47
    నేను నా సమాజానికి ఏదో ఒకటి,
    ఒక చిరుకానుకగా సాధిస్తాను
  • 5:47 - 5:49
    కాని ప్రతి రోజూ నిరాకరించడం జరిగాక
  • 5:49 - 5:51
    ఆ స్త్రీ నాతో చెప్పింది
  • 5:51 - 5:55
    "ఇలా చూడు , మీరందరూ పెద్దవాళ్ళయ్యారు
    మీ చిన్న చెల్లెలికి ఓ పాప వుంది
  • 5:55 - 5:56
    నీ సంగతేంటి"?
  • 5:56 - 6:01
    అదే సంగీతం అక్కడ
    నేను ప్రతిరోజూ విన్నాను
  • 6:01 - 6:05
    ఆ సంగీతాన్ని బాలికలు ప్రతిరోజూ వింటుంటారు
  • 6:05 - 6:09
    వాళ్ళు కాని సంఘం కట్టుబాట్ల ప్రకారం
    నడుచుకోకపోతే
  • 6:12 - 6:15
    నేను రెండు కథల్ని పోల్చి చూసినప్పుడు
    నాదీ నా చెల్లిదీ
  • 6:15 - 6:20
    నేనన్నాను నేనెందుకు ఏదో ఒకటి చేయకూడదూ అని.
  • 6:20 - 6:25
    ఒక విషయాన్ని నేనెందుకు మార్చగూడదు.
    అది చాలా కాలం నుంచి జరుగుతున్నది.
  • 6:25 - 6:28
    మా సమాజంలోనిది
  • 6:28 - 6:30
    నేనప్పుడు ఇతర బాలికల్ని పిలిచాను
  • 6:30 - 6:33
    మా చెల్లెలిలా పిల్లలున్న వాళ్ళని
  • 6:33 - 6:36
    వాళ్ళు తరగతిలోనే వున్నారు కానీ
    చదవడం , రాయడం మరిచిపోయారు
  • 6:36 - 6:38
    నేనన్నాను రండి పరస్పరం గుర్తు చేసుకుందాం
  • 6:38 - 6:40
    మళ్ళీ రాయడం , చదవడం ఎలాగో
  • 6:40 - 6:44
    పెన్నెలా పట్టుకోవాలో
    ఎలా చదవాలో,పుస్తకం ఎలా పట్టుకోవాలో
  • 6:44 - 6:48
    వాళ్ళతో గడిపిన ఆ కాలం చాలా గొప్పది
  • 6:48 - 6:52
    వాళ్ళ గురించి కాస్తైనా
    తెలుసుకున్నానని కాదు
  • 6:52 - 6:56
    కాని వాళ్లు చెప్పగలిగారు
    వారి స్వంత విషయాలని
  • 6:56 - 6:57
    వాళ్ళు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న
    సమస్యలను
  • 6:57 - 7:00
    చిన్నారి తల్లులుగా
  • 7:00 - 7:02
    అప్పుడు నేనేమనుకున్నానంటే ,
  • 7:02 - 7:06
    "మనమెందుకు ఈ విషయాలనన్నింటినీ
    మనకు జరుగుతున్నవాటిని
  • 7:06 - 7:10
    బయటపెట్టకూడదు ,మన తల్లులకు ,
    సాంప్రదాయిక నేతలకు
  • 7:10 - 7:12
    ఇవీ ఇక్కడ జరుగుతున్న తప్పుడు పనులు అని?"
  • 7:12 - 7:14
    ఇలా చేయడం చాలా భీతి గొలిపే విషయం
  • 7:14 - 7:16
    ఎందుకంటే ఈ సాంప్రదాయిక నేతలు
  • 7:16 - 7:18
    ఇలాంటి వాటికి అలవాటు పడివున్నారు
  • 7:18 - 7:21
    ఇది పరంపరగా వస్తున్న ఆచారం
  • 7:21 - 7:22
    మార్చడం చాలా కష్టం
  • 7:22 - 7:25
    కానీ ప్రయత్నించడం మంచిది
  • 7:25 - 7:27
    అలా మేము ప్రయత్నించాము
  • 7:27 - 7:30
    చాలా కష్టమైన పని కానీ ముందుకు సాగాం
  • 7:30 - 7:33
    నేనిప్పుడు చెప్తున్నాను, మా సమాజంలో
  • 7:33 - 7:36
    ఇదే మొదటి సమాజం ,దీంట్లో బాలికలు
  • 7:36 - 7:39
    చాలా కష్టపడి మా నేతను కదిలించారు
  • 7:39 - 7:43
    అలా మా నేత మాకు అండగా నిలిచారు
    అన్నారు ఏ బాలికా పెళ్లి చేసుకోవద్దు
  • 7:43 - 7:46
    18 సంవత్సరాల కన్నా ముందుగా
  • 7:46 - 7:50
    ( చప్పట్లు )
  • 7:54 - 7:55
    మా సమాజంలో
  • 7:55 - 7:58
    అదే మొదటిసారి ఒక సంఘం
  • 7:58 - 8:00
    చట్టాల్ని సవరించారు
  • 8:00 - 8:04
    మొదటి బాలికలను కాపాడే చట్టం
  • 8:04 - 8:06
    మా సమాజంలో
  • 8:06 - 8:08
    అక్కడితో మేము ఆగలేదు
  • 8:08 - 8:11
    మరింత ముందుకు సాగాము
  • 8:11 - 8:15
    మేము బాలికలకై పోరాడాలని నిశ్చయించుకున్నాం
    కేవలం మా సంఘంలోనేకాదు
  • 8:15 - 8:17
    ఇతర సంఘాల గురించి కూడా
  • 8:17 - 8:22
    బాలికల వివాహ చట్టం ఫిబ్రవరిలో
    ప్రవేశ పెట్టినప్పుడు
  • 8:22 - 8:25
    మేం పార్లమెంట్ భవనంలో వున్నాం
  • 8:25 - 8:29
    ప్రతిరోజూ సభ్యులు పార్లమెంట్లో
    ప్రవేశిస్తున్నప్పుడు
  • 8:29 - 8:32
    మేము వాళ్లతో చెప్తుండేవాళ్లము
    దయచేసి ఈ బిల్లును బలపరచండి అని
  • 8:32 - 8:37
    మా దగ్గర ఇక్కడిలాంటి
    టెక్నాలజీ లేదు
  • 8:37 - 8:39
    కానీ మా దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి
  • 8:39 - 8:44
    మేం అనుకున్నాం వారి ఫోన్ నెంబర్లను
    తీసుకుని మెసేజ్ లు ఇవ్వలేమా అని
  • 8:44 - 8:47
    అదే చేసాం .అది చాలా మంచిపని
  • 8:47 - 8:49
    ( చప్పట్లు )
  • 8:49 - 8:52
    బిల్లు పాసయినందుకు వారికి మెసేజ్ ఇచ్చాము
  • 8:52 - 8:55
    ఈ బిల్లును సమర్థించినందుకు కృతజ్ఞతలు అని
  • 8:55 - 8:56
    ( నవ్వులు )
  • 8:56 - 8:59
    ఆ బిల్లు రాష్ట్ర పతిచే సంతకం చేయబడినప్పుడు
  • 8:59 - 9:03
    అది శాసనంగా మారింది .అదో ముందడుగు
  • 9:03 - 9:08
    ఇప్పుడు మలావీ లో 18 చట్టబధ్దమైన
    వివాహ వయస్సు అది 15 నుండి 18 కి మారింది
  • 9:08 - 9:12
    ( చప్పట్లు )
  • 9:14 - 9:18
    తెలుసుకోవాల్సిన మంచి విషయమేంటంటే
    ఆ బిల్లు పాస్ అయ్యింది
  • 9:18 - 9:21
    కాని, ఇది కూడా చెప్పాలి మీకు
  • 9:21 - 9:26
    ఎన్నో దేశాలలో 18 చట్టబద్దమైన వివాహ వయస్సు
  • 9:26 - 9:30
    కానీ మనం ప్రతిరోజూ వినడం లేదా
    ఆ బాలికల , స్త్రీల రోదనలను
  • 9:30 - 9:35
    ప్రతిరోజూ ఎన్నో బాలికల జీవితాలు
    వృధా అయిపోతున్నాయి
  • 9:35 - 9:42
    ఇది కీలక సమయం నాయకులకు వారి
    వాగ్దానాలను నిలబెట్టుకోడానికి
  • 9:42 - 9:44
    వాగ్దానాలను గౌరవించడం అంటే
  • 9:44 - 9:50
    అర్థం - బాలికల సమస్యలను దృష్టిలో
    వుంచుకోవాలి; ప్రతిసారీ.
  • 9:50 - 9:54
    మేము ద్వితీయశ్రేణి వారిగా
    గుర్తింపబడదలచుకోలేదు
  • 9:54 - 9:58
    కానీ వాళ్ళకు తెలియాలి స్త్రీలు
    మనమీ గదిలో వున్నట్లుగా
  • 9:58 - 10:01
    మేము కేవలం స్త్రీలం కాదు
    మేం కేవలం బాలికలం కాదు
  • 10:01 - 10:03
    మేం అసాధారణమైనవారం
  • 10:03 - 10:05
    మేము ఎన్నింటినో చేయగలం
  • 10:05 - 10:08
    మలావి గురించిన మరో విషయం
  • 10:08 - 10:11
    కేవలం మలావే కాదు, ఇతర దేశాలు కూడా
  • 10:11 - 10:15
    అక్కడున్న చట్టాలు
  • 10:15 - 10:20
    మీకు తెలుసు ఒక చట్టం, అమలు పరచనంత కాలం
    అది చట్టమే కాదు
  • 10:20 - 10:24
    ఈ చట్టం ఇటీవలే పాసయ్యింది
  • 10:24 - 10:26
    ఇతర దేశాల్లోని ఇలాంటి చట్టాలను
  • 10:26 - 10:30
    ప్రాంతీయ స్థాయిలో ప్రచారం చేయవలసిన
    అవసరం వుంది
  • 10:30 - 10:33
    సంఘ స్థాయిలో కూడా
  • 10:33 - 10:37
    ఎక్కడైతే బాలికల సమస్యలు తీవ్రంగా వున్నాయో
  • 10:37 - 10:42
    బాలికలు ప్రతిరోజూ, వారి సంఘాల్లో
    తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు
  • 10:42 - 10:48
    అయితే ఈ చిన్న పిల్లలు వారిని రక్షించే
    చట్టాలున్నాయని తెలుసుకున్నట్లయితే
  • 10:48 - 10:52
    వాళ్ళు విశ్వాసంతో నిలబడగలుగుతారు తమనితాము
    రక్షించుకోగలుగుతారు
  • 10:52 - 10:54
    ఎందుకంటే వారికి తెలుసు వారిని
    కాపాడ్డానికో చట్టముందని
  • 10:57 - 11:02
    మరో విషయం నేను చెప్పేదేంటంటే
  • 11:02 - 11:04
    బాలికల ,స్త్రీల గొంతులు
  • 11:04 - 11:08
    అందంగా వుంటాయి,అలానే వుంటాయి
  • 11:08 - 11:11
    అయితే ఒంటరిగా ఇలాంటివి చేయలేము
  • 11:11 - 11:14
    పురుష న్యాయవాదులు, వీటిని పట్టించుకుని
  • 11:14 - 11:16
    కేసులను టేకప్ చేసుకుని ,కలిసి పని చేయాలి
  • 11:16 - 11:17
    ఇది సామూహికంగా చేయాల్సిన పని
  • 11:17 - 11:21
    మనకుకావాల్సింది ,ఎక్కడి బాలికలకైనా
    అవసరమయ్యేదే
  • 11:21 - 11:27
    మంచి విద్య,దానికంటే ముఖ్యం 11 ఏళ్లలో
    పెళ్లి మాత్రం కాదు
  • 11:30 - 11:32
    ఇక్కడ మరో విషయం
  • 11:32 - 11:35
    నాకు తెలుసు ,కలిసికట్టుగా పని చేస్తే
  • 11:35 - 11:41
    మనం చట్టాలను మార్చగలం
  • 11:41 - 11:44
    సాసంస్కృతిక, రాజకీయ చట్రాలను
  • 11:44 - 11:47
    బాలికలకు వారి హక్కులను దూరం చేసేవి
  • 11:47 - 11:51
    ఈ రోజు నేనిలా నిలబడ్డానంటే
  • 11:51 - 12:00
    ప్రకటిస్తున్నా. మనం ఒక తరంలోనే
    బాల్యవివాహాలను అంతం చేయగలం
  • 12:00 - 12:03
    ఇదే సమయం
  • 12:03 - 12:08
    ఎక్కడైతే ఓ బాలిక , మరో బాలిక అలా
    లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా
  • 12:08 - 12:10
    చెప్పగలరో
  • 12:10 - 12:12
    నేను కోరినప్పుడే పెళ్ళిచేసుకుంటాను అని
  • 12:13 - 12:15
    ( కరతాళ ధ్వనులు )
  • 12:15 - 12:25
    కృతజ్ఞతలు
    (చప్పట్లు )
Title:
బాల్య వివాహానికి వ్యతిరేకంగా ఒక యోధురాలి బాథ!
Speaker:
మెమరీ బండ
Description:

మెమరీ బండగారి జీవితం వారి చెల్లెలి జీవితం కన్నా భిన్నంగా సాగింది. వారి చెల్లె యుక్తవయస్కురాలు కాగానే, సంప్రదాయక ఇనీసియేషన్ కాంపులకు పంపబడింది. ఆ క్యాంపులలో, బాలికలకు పురుషులను ఎలా సంతృప్తి పరచాలో నేర్పుతారు. వారి చెల్లి 11 ఏళ్ళ ప్రాయంలోనే గర్భవతి అయ్యింది.
మరోపక్క వక్త బండ, అలాంటి క్యాంపుకు వెళ్ళుటకు నిరాకరించారు. తన తోటివారిని సంఘటితం చేసి, తమ సంఘం నాయకుడ్ని 18 ఏళ్ళలోపు జరిగే బలవంతపు వివాహాల్ని అరికట్టే వివాహ చట్ట మార్పు చేయమని కోరారు. అలా సంఘంతో మొదలైన ఆమె ప్రయాణం మలావి దేశపు చట్టాన్నే మార్చి, బాలికల జీవితాల్లో వెలుగులు నింపింది

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
12:38

Telugu subtitles

Revisions