Return to Video

ఫెర్గూసన్ వ్యతిరేక ప్రదర్శనలో నేనేం చూసాను

  • 0:00 - 0:03
    నాకు భయమేస్తుంది
  • 0:04 - 0:05
    ఈ క్షణంలో
  • 0:05 - 0:07
    ఈ వేదికపై
  • 0:07 - 0:08
    నాకు భయం కలుగుతోంది
  • 0:09 - 0:11
    భయంతో ఉన్నట్టు ఒప్పుకోడానికి
  • 0:11 - 0:13
    సిధ్ధమైనవాళ్లనుజీవితంలో
    నేనెక్కువ మందినికలవలేదు
  • 0:14 - 0:16
    నాఉద్దేశ్యంలో అంతరాంతరాలలో ఇదెంత
  • 0:16 - 0:17
    వేగంగా వ్యాపిస్తుందో
    వారికి తెలుసు.
  • 0:18 - 0:20
    భయం అనేది జబ్బులాంటిది.
  • 0:21 - 0:23
    అది కదిలితే దావానలంలా వ్యాపిస్తుంది.
  • 0:24 - 0:25
    కాని అప్పుడేమౌతుందంటే
  • 0:26 - 0:27
    భయం ముంగిట్లో వుండికూడా
  • 0:27 - 0:29
    మీరేం చేయాలో అదే చేస్తారు
  • 0:29 - 0:31
    అదే ధైర్యమంటే.
  • 0:31 - 0:33
    భయం లాగానే.
  • 0:33 - 0:34
    ధైర్యం కూడా అంటువ్యాధే.
  • 0:36 - 0:38
    నేను ఇల్లినాయిస్ లోని St.Louis వాసిని
  • 0:38 - 0:39
    అదో చిన్న నగరం
  • 0:39 - 0:42
    అక్కడే మిసిసిపి నది ఒడ్డున.
  • 0:42 - 0:46
    St.Louis చుట్టుప్రక్కలనే
    నా జీవితమంతా గడిచింది
  • 0:48 - 0:50
    ఎప్పుడైతే
    మైక్ ల్ బ్రౌన్ జూ.
  • 0:50 - 0:51
    ఒక సాధారణ యువకుడు
  • 0:51 - 0:56
    మిస్సోరి లోని ఫెర్గూసన్ లో 2014లో
    పోలీసులచేత చంపబడ్డాడు
  • 0:56 - 0:59
    అది నార్త్ లూయిస్ లోని ఇంకో శివారు
  • 0:59 - 1:00
    నేను గుర్తు చేసుకుంటున్నాను
  • 1:00 - 1:02
    అతను మొదటివాడేం కాదు
  • 1:02 - 1:06
    చట్టాన్ని అమలు పరచడంలో చనిపోయిన వారిలో
    చివరివాడు కూడా కాదు
  • 1:06 - 1:08
    కానీ ఇతని మరణం వేరు
  • 1:09 - 1:10
    మైక్ మరణించినప్పుడు
  • 1:10 - 1:14
    నాకు గుర్తున్నది కొన్ని శక్తులు భయాన్ని
    ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నించాయి
  • 1:15 - 1:19
    సంతాపంలో వున్న ఒక వర్గాన్ని
    పోలీసులు బలాన్ని వాడి
  • 1:19 - 1:20
    భయాన్ని సృష్టించాలని
  • 1:21 - 1:22
    సాయుధులైన పోలీసులను చూసి భయం
  • 1:23 - 1:24
    జైలుశిక్ష
  • 1:24 - 1:25
    జరిమానా.
  • 1:25 - 1:28
    మీడియా కూడా అలా ఒక కథ అల్లడం ద్వారా
  • 1:28 - 1:29
    మేం పరస్పరం
    భయపడేలా చేసింది.
  • 1:29 - 1:32
    ఇలాంటివన్నీ గతంలో పని చేసేవి
  • 1:32 - 1:34
    కానీ నేను చెప్పినట్లు
    ఇప్పటి పరిస్థితి వేరు
  • 1:36 - 1:39
    మైకెల్ మరణం,తర్వాత ఆ వర్గం పట్ల
    అనుసరించిన విధానం
  • 1:39 - 1:43
    పరిసర ప్రాంతాలలో వరుస
    అభ్యంతరాలకు దారితీసింది
  • 1:44 - 1:47
    నేను 4లేక 5 వ రోజు చూడ్డానికి వెళ్ళినా
  • 1:47 - 1:49
    ధైర్యంగా మాత్రం వెళ్ళలేదు
  • 1:49 - 1:51
    అపరాధభావంతోనే వెళ్ళాను
  • 1:51 - 1:53
    నేను నల్లజాతివాడిని
  • 1:53 - 1:55
    మీరు గమనించారో లేదో నాకు తెలీదు.
  • 1:55 - 1:56
    ( నవ్వులు )
  • 1:56 - 2:02
    ఫెర్గూసన్ కి కొద్ది దూరంలోనే వున్న
    లూయిస్ లో వుండలేక పోయాను
  • 2:02 - 2:03
    చూడకుండా ఆగలేక పోయాను
  • 2:03 - 2:05
    నా పనుల్ని పక్కకు పెట్టి వెళ్ళాను
  • 2:06 - 2:07
    అక్కడికి చేరుకున్నక
  • 2:07 - 2:09
    నాకో ఆశ్చర్యకరమైనది కనిపించింది
  • 2:11 - 2:13
    జనం కోపాన్ని చూసాను:చాలా తీవ్రమైన ఆక్రోశం
  • 2:14 - 2:16
    కానీ దాన్ని మించిన ప్రేమ కన్పించింది.
  • 2:17 - 2:19
    ప్రజల్లో స్వాభిమానం కనిపించింది
  • 2:19 - 2:20
    వారి వర్గం పట్ల అభిమానం.
  • 2:20 - 2:22
    అది చాలా అందమైనది..
  • 2:22 - 2:24
    పోలీసులు వచ్చేవరకూ.
  • 2:25 - 2:28
    అప్పుడు వారి మాటల్లో ఒక క్రొత్తభావం
    పొటమరించింది:
  • 2:29 - 2:30
    భయం.
  • 2:31 - 2:32
    నేనిప్పుడు అబధ్దం చెప్పట్లేదు:
  • 2:32 - 2:35
    ఆయుధాలతో వున్న ఆ వాహనాలను చూడగానే
  • 2:35 - 2:36
    ఆ మందీ మార్బలాలను
  • 2:36 - 2:38
    ఆ తుపాకుల్ని
  • 2:38 - 2:39
    ఆ పోలీసులనూ
  • 2:40 - 2:41
    అంతరాంతరాలలో..
  • 2:41 - 2:42
    భయపడ్డాను నేను.
  • 2:44 - 2:46
    ఆ గుంపును చూడగానే,
  • 2:46 - 2:49
    చాలా మంది మనసుల్లో ఇదే భావం కనిపించింది.
  • 2:49 - 2:52
    వారి మనసుల్లో ఇంకేదో కన్పించింది నాకు
  • 2:52 - 2:54
    అదే ధైర్యం.
  • 2:54 - 2:55
    చూడండి, వారు అరుస్తున్నారు
  • 2:55 - 2:56
    కేకలు వేస్తున్నారు,
  • 2:57 - 2:59
    వారు పోలీసుల్నించి దూరంగా వెళ్ళాలని
    అనుకోవడం లేదు
  • 2:59 - 3:01
    వారు ఆ స్థితిని దాటేశారు.
  • 3:01 - 3:03
    నాలోనూ ఏదో మార్పును గమనించాను.
  • 3:03 - 3:05
    నేనూ అరిచాను ,కేకలు పెట్టాను
  • 3:05 - 3:09
    గమనిస్తే నా చుట్టున్నవారూ
    అదే పని చేస్తున్నారు
  • 3:10 - 3:12
    ఆ భావాన్ని నేను మాటల్లో చెప్పలేను.
  • 3:13 - 3:15
    దాంతో ఇంకేదో చేయాలని నిర్ణయించుకున్నాను.
  • 3:16 - 3:19
    ఇంటికి వెళ్ళాను.నేనొక కళాకారుడిని.
  • 3:19 - 3:23
    జరిగిందాన్ని ఎదిరించాలని
    పని చేయడం మొదలెట్టాను
  • 3:24 - 3:27
    అవే ఈ ఆధ్యాత్మిక యుధ్ధానికి ఆయుధాలు
  • 3:28 - 3:30
    ప్రజలకు బలాన్ని ఇస్తాయి
  • 3:31 - 3:34
    చేరవలసిన గమ్యాన్ని దగ్గర చేస్తాయి.
  • 3:35 - 3:38
    ప్రొటెస్టర్ల చేతులను ఫోటో తీయాలనే
    ప్రాజెక్ట్ ను చేపట్టాను
  • 3:38 - 3:42
    వాటిని భవనాల పైన క్రింద అతికించాను
  • 3:43 - 3:44
    పెద్దషాపుల్లోనూ
  • 3:45 - 3:48
    ప్రజల్లో ధైర్యాన్ని ,జాగరూకతను
    పెంచడమే నా లక్ష్యం
  • 3:49 - 3:51
    నేననుకున్నాను ,ఓ క్షణమైనా
  • 3:51 - 3:52
    అది నెరవేరింది.
  • 3:54 - 3:57
    అప్పుడనుకున్నాను,వీరి కథలను
    నలుగురికి తెలియజెప్పాలని
  • 3:58 - 4:00
    ఆ క్షణాలలో ధీరత్వాన్ని నేను గమనించాను
  • 4:00 - 4:04
    నేను,నా స్నేహితుడు
  • 4:04 - 4:06
    దర్శకుడు, భాగస్వామి తో కలిసి
  • 4:06 - 4:08
    డాక్యుమెంటరీగా మలిచాము
  • 4:08 - 4:10
    "Whose Streets?"
  • 4:11 - 4:14
    నాకు వచ్చిన ఈ ధైర్యానికి
  • 4:14 - 4:17
    నేనొక వాహకమయ్యాను.
  • 4:17 - 4:20
    కళాకారులుగా అది మా బాధ్యత అనుకుంటాను.
  • 4:21 - 4:25
    మేం చేస్తున్న ప్రతి పనిలో ధైర్యానికి
    ప్రతీకలుగా వుండాలనుకుంటాను.
  • 4:25 - 4:30
    సాధారణ ప్రజానీకానికి అధికారాన్ని
    అడ్డు పెట్టుకుని భయాన్ని, ద్వేషాన్ని
  • 4:30 - 4:33
    వ్యాప్తిచేసే వారికి మధ్య మేమొక
    వారధి లాంటి వాళ్ళము
  • 4:33 - 4:35
    ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో.
  • 4:36 - 4:38
    నేనిప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను.
  • 4:38 - 4:40
    ఇక్కడున్న అందర్నీ
  • 4:41 - 4:43
    మీకు తెలుసు,ఆలోచనా పరులైన నాయకులు గా
  • 4:43 - 4:44
    మీరందుకున్న బహుమతులతో
  • 4:44 - 4:47
    మీరేం చేయదలచుకున్నారు నిత్యమూ మమ్మల్ని
  • 4:47 - 4:49
    కలిపివుంచే
    భయాన్నుంచి ఎలా విడదీయాలనుకుంటున్నారు?
  • 4:50 - 4:52
    కారణం నేను ప్రతిరోజూ భయపడుతూ వుంటాను
  • 4:52 - 4:54
    భయపడని క్షణం నాకు గుర్తు లేదు
  • 4:55 - 4:59
    భయం నన్ను నిర్వీర్యుణ్ని చేయలేదని తెలిసాక
  • 5:00 - 5:01
    అదినన్ను కాపాడటానికే
    వుందని తెలిశాక
  • 5:02 - 5:04
    భయాన్ని ఎలా వాడుకోవాలో
    ఒకసారి తెలిసాక
  • 5:05 - 5:06
    నా శక్తిని నేను గుర్తించాను.
  • 5:07 - 5:08
    కృతజ్ఞతలు.
  • 5:08 - 5:11
    ( కరతాళధ్వనులు )
Title:
ఫెర్గూసన్ వ్యతిరేక ప్రదర్శనలో నేనేం చూసాను
Speaker:
డామన్ డేవిస్
Description:

2014 లో డామన్ డెవిస్ మిస్సోరి లోని ఫెర్గూసన్ లో పోలీస్ కాల్పులలో మైకెల్ బ్రౌన్ మరణాన్ని చూసాడు.ఆ సంఘటనలో అతడు జనాల్లో కోపాన్ని మాత్రమేగాక వ్యక్తిగతంగా,సంఘపరంగా అభిమానాన్ని చూసాడు.అతని డాక్యుమెంటరీ "Whose Streets?" ఆందోళన కారుల దృక్కోణాన్ని చూపుతుంది.భయాన్ని, ద్వేషాన్నీ వ్యాప్తి చేసేవారిని ఎదిరించే గుండెధైర్యాన్ని వివరిస్తుంది.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
05:25

Telugu subtitles

Revisions