Return to Video

కోపం ద్వారా శాంతిని ఎలా తేగలం?

  • 0:00 - 0:06
    ఈ రోజు నేను కోపం గురించి మాట్లాడబోతున్నాను
  • 0:09 - 0:11
    నా పదకొండేళ్ళ వయస్సులో
  • 0:11 - 0:14
    నా స్నేహితుల్లో కొందరు
    బడి మానేయడం చూసాను
  • 0:14 - 0:19
    ఎందుకంటే వారి తల్లిదండ్రులకు పుస్తకాలు
    కొనే స్తోమత లేదు
  • 0:19 - 0:21
    ఇది నాకు కోపం తెప్పించింది
  • 0:23 - 0:26
    నా 27 ఏళ్ల వయస్సులో
  • 0:26 - 0:31
    గత్యంతరం లేక ఒక బానిస తండ్రి
    కూతుర్ని వేశ్యాగృహానికి అమ్మడానికి
  • 0:31 - 0:36
    సిద్దమయ్యారని విన్నా. ఆ దురావస్త
  • 0:36 - 0:39
    నాకు కోపం వచ్చింది
  • 0:40 - 0:43
    50 ఏళ్ళ వయస్సులో
  • 0:43 - 0:48
    రక్తపుమడుగులోవీధిలో పడివున్నాను
  • 0:48 - 0:51
    నా కొడుకుతో సహా
  • 0:51 - 0:53
    నాకు కోపం వచ్చింది
  • 0:55 - 1:00
    ప్రియమిత్రులారా శతాబ్దాలనుండి మనం
    కోపం చెడ్డదని నేర్చుకున్నాం
  • 1:01 - 1:03
    మన తల్లిదండ్రులు, గురువులు, మతపెద్దలు
  • 1:03 - 1:09
    ప్రతిఒక్కరు కోపాన్ని ఎలా నియంత్రించాలో ,
    ఎలా అణచాలో నేర్పారు
  • 1:12 - 1:14
    కానీ ఎందుకు? అని నేను ప్రశ్నిస్తున్నాను
  • 1:16 - 1:21
    ఈ కోపాన్ని మనం సమాజానికి ఉపయోగకారిగా
    ఎందుకు మార్చగూడదు?
  • 1:21 - 1:22
    మనమెందుకు మన కోపాన్ని వాడకూడదు
  • 1:22 - 1:26
    లోకంలోని చెడును సవాలుచేయడానికి
    మార్చడానికై
  • 1:30 - 1:32
    అదే చేయాలని నేను ప్రయత్నించాను
  • 1:34 - 1:36
    మిత్రులారా
  • 1:37 - 1:43
    నేను కోపంగా వున్నప్పుడే నా మనస్సు లో
    అధ్భుతమైన ఆలోచనలు వచ్చాయి
  • 1:44 - 1:54
    ఎలా అంటే 35 ఏళ్ల వయస్సులో చిన్న
    జైలుగదిలో బంధింపబడి వున్నప్పుడు
  • 1:55 - 1:57
    ఆ రాత్రంతా నేను కోపంగా వున్నాను
  • 1:58 - 2:01
    కానీ అప్పుడే కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి
  • 2:01 - 2:04
    దాని గురించి తర్వాత చెప్తాను
  • 2:04 - 2:11
    నాకో పేరెలా వచ్చిందో ఆ కథతో మొదలుపెడాతాను
  • 2:13 - 2:18
    బాల్యం నుంచీ మహాత్మా గాంథీజీకి గొప్ప
    అభిమానిని
  • 2:19 - 2:24
    స్వాతంత్ర ఉద్యమం లో ఆయన ముందు
    నడిచారు, పోరాడారు
  • 2:25 - 2:27
    కానీ ముఖ్యమైనదేంటంటే
  • 2:27 - 2:34
    అణగారిన వర్గాలను ఎలా చూడాలో నేర్పారు
  • 2:34 - 2:38
    బలహీన వర్గాలను గౌరవంతో , మర్యాదతో
  • 2:40 - 2:45
    మరి, ఇండియా సంబరాలు జరుపుకుంటోంది
  • 2:45 - 2:48
    1969లో గాంధీజీ శతాబ్ది సంవత్సరంగా
  • 2:48 - 2:50
    అప్పుడు నాకు పదిహేనేళ్లు
  • 2:50 - 2:52
    ఒక ఆలోచన నాలో మెదిలింది
  • 2:54 - 2:57
    దీన్నే మరోలా ఎందుకు జరుపుకోగూడదు అని
  • 2:57 - 3:03
    నాకు తెలుసు,బహుశా మీలో
    చాలా మందికి తెలిసుండొచ్చు
  • 3:03 - 3:11
    ఇండియా లో అధిక సంఖ్యాకులు
    క్రింది తరగతులలోనివారు
  • 3:12 - 3:15
    వీరిని అస్పృశ్యులుగా పరిగణిస్తున్నాం
  • 3:15 - 3:17
    ఈ ప్రజలనే
  • 3:17 - 3:21
    గుళ్ళల్లోనికి రానివ్వాలని మరిచి పోయాం
  • 3:21 - 3:28
    ఉన్నత కులాల ఇండ్లల్లోకి,
    షాపులలోకి రాలేరు వారు
  • 3:28 - 3:34
    మా నగరంలోని నాయకులు నన్ను చాలా
    ప్రభావితం చేసారు
  • 3:34 - 3:38
    వారు కులవ్యవస్థ,అస్పృశ్యతల గురించి
    చాలా గొప్పగా మాట్లాడేవారు
  • 3:38 - 3:40
    గాంధీజీ ఆదర్శాల గురించి మాట్లాడేవారు
  • 3:42 - 3:45
    ఆ ప్రేరణతో దానిరకి ఒక కార్యరూపాన్ని
    ఇవ్వాలనుకున్నానము
  • 3:45 - 3:51

    వారిని భోజనానికి పిలవాలనుకున్నాను
    అది వండి, వడ్డించబడేది
  • 3:51 - 3:55
    అస్పృశ్య వర్గాల ప్రజలచే
  • 3:55 - 4:00
    అస్పృశ్యులనబడే నిమ్నజాతీయుల వద్దకువెళ్ళాను
  • 4:01 - 4:06
    వారిని ఒప్పించడానికి ప్రయత్నించాను
    వారిది ఊహించలేదు
  • 4:06 - 4:10
    వారు చెప్పారు" ఇది సాధ్యం కాదు
    ఇలా ఎప్పుడూ జరగలేదు "అని
  • 4:11 - 4:13
    ఈ నాయకులను చూడండి అని చెప్పాను
  • 4:13 - 4:15
    వారు చాలా గొప్పవారు.
    అస్పృశ్యతకు వ్యతిరేకులు
  • 4:15 - 4:18
    వారు తప్పక వస్తారు.రాకున్నా మనమొక
    ఉదాహరణగా నిల్చిపోతాము
  • 4:21 - 4:27
    వారు నన్ను విశ్వసనీయునిగా భావించారు
  • 4:28 - 4:31
    చివరికి వారు ఒప్పుకున్నారు
  • 4:31 - 4:36
    నేను , నామిత్రులు కలిసి సైకిళ్లపై వెళ్లి,
    రాజకీయ నాయకులను ఆహ్వానించాము
  • 4:38 - 4:41
    నేను పులకించాను.సాధికారంగా
  • 4:41 - 4:46
    ప్రతిఒక్కరూ రావడానికి
    అంగీకరించేలా చేసాను అని
  • 4:47 - 4:50
    గొప్ప ఆలోచన. మనమొక ఉదాహరణగా
    నిల్చిపోతామనుకున్నాను
  • 4:50 - 4:54
    మనము సంఘంలో మార్పును తేగలం
  • 4:55 - 4:57
    ఆ రోజు రానే వచ్చింది
  • 4:58 - 5:03
    అస్పృశ్యులందరూ అంటే
    ముగ్గురు ఆడవాళ్లు , ఇద్దరు మగవాళ్లు
  • 5:03 - 5:07
    రావడానికి ఒప్పుకున్నారు
  • 5:07 - 5:13
    నాకు గుర్తు వస్తోంది .వారికున్నవాటిల్లో
    మంచిబట్టలు వేసుకున్నారు
  • 5:14 - 5:17
    కొత్తగా పాత్రలను కొని తెచ్చుకున్నారు
  • 5:18 - 5:20
    కొన్నిసార్లు వందల సార్లు స్నానం చేసారు
  • 5:20 - 5:23
    వారు ఊహించలేని విషయం ఇది
  • 5:23 - 5:26
    మార్పు వచ్చే క్షణాలవి
  • 5:27 - 5:30
    వాళ్లు చేరుకున్నారు.భోజనం తయారయ్యింది
  • 5:30 - 5:33
    అప్పుడు సమయం 7 గంటలు
  • 5:33 - 5:36
    8 గంటలయ్యింది. మేం ఎదురుచూస్తున్నాం
  • 5:36 - 5:41
    నాయకులు ఆలస్యంగా రావడం సాధారణమైన విషయం
  • 5:41 - 5:43
    మరో గంట గడిచింది
  • 5:43 - 5:50
    8 తర్వాత మేం సైకిళ్లపై ఆ నాయకుల
    ఇళ్లకు బయల్దేరాము
  • 5:50 - 5:52
    వారికి గుర్తు చేయాలని
  • 5:54 - 5:59
    ఒక నాయకుని భార్య నాతో చెప్పింది
  • 5:59 - 6:04
    క్షమించండి.ఆయనకు తలనొప్పిగావుంది
    బహుశా ఆయన రాలేరు
  • 6:04 - 6:06
    మరో నాయకుని వద్దకు వెళ్ళాం
  • 6:06 - 6:10
    ఆయన భార్య చెప్పింది.సరే మీరు వెళ్లండి
    ఆయన తప్పకుండా వస్తారు అని
  • 6:11 - 6:15
    ఆ రాత్రి విందు జరుగుతుందని
    నేను అనుకున్నాను
  • 6:15 - 6:20
    పెద్ద సంఖ్యలో కాకున్నా
  • 6:21 - 6:27
    నేను తిరిగి ఆ స్థలానికి వెళ్ళాను.
    అది కొత్తగా కట్టిన గాంధీ పార్కు
  • 6:29 - 6:30
    రాత్రి పదయ్యింది.
  • 6:31 - 6:35
    నాయకులెవ్వరూ రాలేదు
  • 6:36 - 6:39
    ఆది నాకు కోపం తెప్పించింది.
  • 6:40 - 6:47
    నేను మహాత్మా గాంధీ విగ్రహాన్ని
    ఆనుకుని నిలబడ్డాను
  • 6:50 - 6:54
    నేను మానసికంగా కృంగి పోయాను,అలసట కన్నా
  • 6:57 - 7:02
    ఆహార పదార్థాలున్న చోట నేను కూర్చున్నాను
  • 7:06 - 7:08
    నా భావాలను అణుచుకున్నాను
  • 7:08 - 7:12
    నేను మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే
  • 7:12 - 7:15
    నాకు కన్నీళ్ళొచ్చాయి
  • 7:15 - 7:20
    హఠాత్తుగా నా భుజంపై ఒక చేతి స్పర్శను
    తెలుసుకున్నాను
  • 7:20 - 7:26
    అద్ మాతృహృదయంతో,ఓదార్పు నిస్తున్న
    అస్రృశ్యురాలైన ఒక స్త్రీది
  • 7:26 - 7:30
    "కైలాశ్ ఎందుకేడుస్తున్నావు?" అని అడిగింది
  • 7:32 - 7:34
    "నీకు సాధ్యమైంది నువ్వు చేసావు.
  • 7:34 - 7:37
    అస్పృశ్యులు వండిన భోజనం తిన్నావు
  • 7:37 - 7:40
    మాకు తెలిసి ఇలా ఎప్పుడూ జరగలేదు.
  • 7:41 - 7:46
    నువ్వీ రోజు గెలిచావు!" అన్నది.
  • 7:46 - 7:51
    మిత్రులారా ఆమె మాట నిజం
  • 7:52 - 7:56
    అర్థరాత్రి దాటాక నేను ఇంటికి వచ్చాను
  • 7:56 - 8:00
    ఉన్నత కులాలకు చెందిన పెద్దలనేకులను
    చూసి ఆశ్యర్యపోయాను
  • 8:00 - 8:03
    మా వసారా లో కూర్చుని ఉన్నారు
  • 8:03 - 8:06
    నా తల్లి , వృధ్ద స్త్రీలు ఏడవడం నేను చూసాను
  • 8:06 - 8:10
    వాళ్ళు పెద్దలను బ్రతిమాలుతున్నారు
  • 8:10 - 8:13
    ఎందుకంటే వారు మా కుటుంబాన్ని
    వెలివేస్తామని బెదిరించారు
  • 8:14 - 8:19
    మీకు తెలుసు వెలివేయటం అనేది సామాజికంగా
    అతి పెద్దశిక్ష
  • 8:19 - 8:22
    అని ఊహించవచ్చు
  • 8:24 - 8:29
    చివరికి నన్ను మాత్రమే శిక్షించడానికి
    అంగీకరించారు.ఆ శిక్ష పరిశుధ్దం చేయడం
  • 8:29 - 8:33
    అంటే నేను మా ఊరినుంచి దూరంగా
    600 మైళ్లు వెళ్ళాలి
  • 8:33 - 8:37
    పవిత్ర స్నానం చేయడానికి గంగా తీరం వెళ్ళాలి
  • 8:37 - 8:42
    తర్వాత 101 పూజారులకు విందుభోజనం
    ఏర్పాటు చేయాలి
  • 8:42 - 8:45
    వాళ్ల కాళ్లు కడిగి , ఆ నీళ్లు త్రాగాలి
  • 8:47 - 8:50
    ఇది పూర్తిగా అర్థం లేని పని
  • 8:50 - 8:52
    ఆ శిక్షకు నేను ఒప్పుకోలేదు
  • 8:53 - 8:55
    నన్ను శిక్షించడానికి వాళ్లెవరు?
  • 8:55 - 9:01
    ఇంట్లోని వంటశాల,భోజనశాలలో
    నాకు ప్రవేశం నిషిధ్దం చేసారు
  • 9:01 - 9:04
    నా వంట పాత్రలను వేరు చేశారు
  • 9:04 - 9:09
    కోపంతో వున్న ఆ రాత్రి నన్ను ఇంట్లోంచి
    బయటికి పంపాలనుకున్నారు
  • 9:11 - 9:15
    కాని నేను కులవ్యవస్థనే బహిష్కరించాలని
    నిశ్చయించుకున్నాను
  • 9:16 - 9:20
    ( కరతాళ ధ్వనులు )
  • 9:21 - 9:26
    అది ఎలా సాధ్యపడిందంటే.మొదలెలాగంటే
  • 9:26 - 9:28
    ఇంటిపేరుని , లేదా సర్ నేమ్ ని మార్చడంతో
  • 9:28 - 9:32
    ఎందుకంటే ఇండియాలో చాలాభాగం
    ఇంటిపేర్లు కులాన్నిసూచించేవి
  • 9:32 - 9:34
    కనుక నా పేరుని వదిలేయాలని నిశ్టయించాను
  • 9:34 - 9:41
    తర్వాత నేనో కొత్తపేరుని పెట్టుకున్నాను
    'సత్యార్థి' అని
  • 9:41 - 9:44
    అంటే సత్యాన్ని వెతికేవాడని అర్థం
  • 9:45 - 9:49
    ( కరతాళ ధ్వనులు )
  • 9:49 - 9:53
    అదే ప్రారంభం రూపం మారిన నా కోపానికి
  • 9:54 - 9:57
    మిత్రులారా మీలో ఎవరోఒకరు నాతో చెప్పొచ్చు
  • 9:57 - 10:02
    బాలల హక్కులకోసం పోరాడ్డానికి ముందు
    నేనేం చేసేవాడినో
  • 10:02 - 10:04
    ఎవరికైనా తెలుసా?
  • 10:05 - 10:06
    తెలీదు
  • 10:06 - 10:13
    ఇంజనీరుని, నేనొక ఎలక్ట్రికల్ ఇంజనీరుని
  • 10:13 - 10:18
    అప్పుడు నేను తెలుసుకున్నాను,శక్తి ఏరకంగా
  • 10:18 - 10:22
    కర్రని, బొగ్గుని కాలుస్తుందో
  • 10:22 - 10:26
    ఛాంబర్లలోపల న్యూక్లియర్ ఎలా బద్దలౌతుందో
  • 10:26 - 10:29
    నదీ ప్రవాహాలను ఎలా ఉధృతంగా మారుస్తుందో
  • 10:29 - 10:33
    గాలులను ప్రచండంగా మారుస్తుందో
  • 10:33 - 10:38
    అలా విద్యుత్తుగా మార్చడం ద్వారా వేల
    జీవితాలను వెలిగించొచ్చు
  • 10:39 - 10:43
    నేను నేర్చుకున్నాను అదుపులో లేని
    శక్తి స్వరూపాన్ని
  • 10:43 - 10:48
    నియంత్రించడం ద్వారా సంఘాన్ని
    మెరుగుపరచొచ్చని
  • 10:53 - 11:00
    ఇప్పుడు నేను వెనక్కి వెళ్లి ,
    జైలు కెళ్లిన కథ చెప్తాను
  • 11:00 - 11:04
    డజను పిల్లల్ని బానిసత్వం నుండి
    విడుదల చేసినందుకు చాలా సంతోషించాను
  • 11:04 - 11:07
    వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు
  • 11:07 - 11:10
    ఓ పిల్లవాన్ని విముక్తి చేసినప్పటి
    నా ఆనందాన్ని వర్ణించలేను
  • 11:11 - 11:12
    నాకు చాలా సంతోషం కలిగింది
  • 11:13 - 11:19
    కానీ స్వస్థలమైన ఢిల్లీకి రావడానికి
    రైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు
  • 11:19 - 11:22
    డజన్ల కొద్దీ పిల్లలు రావడం చూసాను
  • 11:22 - 11:26
    వారు మరొకరి చేతుల్లో చిక్కుకుంటున్నారు
  • 11:26 - 11:28
    నేను వారిని ఆపాను.
    వారిగురించి
  • 11:28 - 11:31
    పోలీసులతో ఫిర్యాదు చేసాను
  • 11:31 - 11:35
    పోలీసులు నాకు సాయం చేయడానికి బదులు
  • 11:35 - 11:41
    ఒక చిన్న సెల్ లోకి జంతువులాగా నెట్టేసారు
  • 11:42 - 11:43
    అది కోపంతో నిండిన రాత్రి.
  • 11:43 - 11:47
    ఒక బృహత్తరమైన ఆలోచన
    రూపుదిద్దుకున్న రాత్రి అది
  • 11:48 - 11:53
    ఒ పదిమంది పిల్లల్ని విడుదల చేస్తే మరో
    50 మంది చేరుతారు అనే ఆలోచన వచ్చింది
  • 11:53 - 11:55
    అలా లాభం లేదు
  • 11:55 - 11:57
    నాకు వినియోగదారుల శక్తి మీద నమ్మకముంది
  • 11:57 - 12:01
    మీకో విషయం చెప్పాలి . మొదటిసారిగా
  • 12:01 - 12:06
    ప్రచారాన్ని మొదలుపెట్టాను ప్రపంచవ్యాప్తంగా
  • 12:06 - 12:10
    వినియోగదారులను మేల్కొల్పడానికై
  • 12:10 - 12:15
    బాలకార్మికుల ప్రమేయం లేని రగ్గుల సరఫరా
  • 12:16 - 12:19
    యూరప్ , అమెరికాలల్లో మేం విజయం సాధించాము
  • 12:19 - 12:24
    దీంతో బాలకార్మికుల సంఖ్య పడిపోయింది
  • 12:24 - 12:27
    దక్షిణాసియా దేశాల్లో అది 80 శాతం తగ్గింది
  • 12:27 - 12:30
    ( కరతాళ ధ్వనులు )
  • 12:33 - 12:39
    అంతేకాదు , ఇంతవరకూ లేని వినియోగదారుల
    శక్తి లేదా ప్రచారం
  • 12:39 - 12:44
    ఇతర దేశాలకూ, పరిశ్రమలకూ పాకింది.
  • 12:44 - 12:49
    చాక్లెట్లు,దుస్తులు,పాదరక్షలు ఏవైనా
    కావచ్చు- వాటిని ఇది మించింది
  • 12:51 - 12:53
    11 సం. వయస్సులో వచ్చిన నా కోపంతో
  • 12:53 - 12:58
    పిల్లలకు విద్య ఎంత అవసరమో తెలుసుకున్నాను
  • 12:58 - 13:06
    బీద పిల్లల కోసం వాడిన పుస్తకాలను
    సేకరించాలనే ఆలోచన వచ్చింది
  • 13:06 - 13:09
    11ఏళ్ళప్పుడు నేనో 'Book Bank'
    (పుస్తక సమీకరణ) ఏర్పాటు చేసాను
  • 13:11 - 13:12
    కానీ అక్కడితో ఆగలేదు
  • 13:12 - 13:14
    తరువాత నేను విద్యాప్రచారం కోసం
  • 13:14 - 13:19
    ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ సొసైటీని
    స్థాపించాను
  • 13:19 - 13:22
    అది విద్య కోసం అంతర్జాతీయ
    ప్రచారం
  • 13:22 - 13:27
    ఇది విద్య పట్ల అభిప్రాయాన్ని
    మార్చడానికి సహాయపడింది
  • 13:27 - 13:29
    సేవామార్గం నుండి, మానవహక్కులదిశగా
  • 13:29 - 13:34
    బడికి వెళ్పని పిల్లల సంఖ్యను
    తగ్గించటంలో నిర్ధిష్టంగా తోడ్పడింది
  • 13:34 - 13:38
    గడచిన 15 సం.లో సగానికి తగ్గించింది
  • 13:38 - 13:42
    ( కరతాళధ్వనులు )
  • 13:44 - 13:47
    27 ఏళ్ల వయస్సు లోని నాకోపం
  • 13:47 - 13:52
    వేశ్యా గృహానికి అమ్మి వేయబడుతున్న
    బాలికను రక్షించింది
  • 13:52 - 13:57
    ఒక ఆలోచననిచ్చింది
  • 13:57 - 14:01
    ఎదుర్కొని, రక్షించడంలో ఒక కొత్తవ్యూహాన్ని
    రచించడానికి
  • 14:01 - 14:04
    బానిసత్వంలోంచి పిల్లల విముక్తికై
  • 14:05 - 14:11
    నేను అదృష్టవంతుణ్ణి,గర్వంగా చెప్పాలంటే
    పదీ , ఇరవై కాదు
  • 14:11 - 14:17
    నేను, నా సహచరులం కలిసి, వాస్తవంగా 83,000
    బాలకార్మికులకు విముక్తి కల్పించాము
  • 14:17 - 14:20
    వారిని తిరిగి వారి కుటుంబాలకు ,
    తల్లులకు అప్పగించాము.
  • 14:20 - 14:23
    ( కరతాళ ధ్వనులు )
  • 14:26 - 14:28
    మనకు అంతర్జాతీయ
    విధానాలు కావాలని నాకు తెలుసు
  • 14:28 - 14:31
    బాలకార్మికత వ్యతిరేకంగా
    ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాం
  • 14:31 - 14:37
    దాని ఫలితం ఒక క్రొత్త అంతర్జాతీయ
    సమ్మేళనానికి దారితీసింది
  • 14:37 - 14:41
    దయనీయ స్థితిలో వున్న
    పిల్లల్ని రక్షించడంకోసం
  • 14:42 - 14:46
    దాని ప్రభావంతో బాలకార్మికుల
    సంఖ్య గ్లోబల్ గా
  • 14:46 - 14:52
    గత 15 ఏళ్ళలో 1/3వ వంతుకు పడిపోయింది
  • 14:52 - 14:56
    ( కరతాళ ధ్వనులు )
  • 14:56 - 15:00
    ప్రతి సందర్భంలోనూ
  • 15:00 - 15:04
    కోపంతో మొదలై
  • 15:04 - 15:06
    ఒక ఆలోచనకు,
  • 15:06 - 15:10
    క్రియకు దారితీసింది
  • 15:10 - 15:12
    అయితే కోపం, దాని తర్వాత?
  • 15:12 - 15:15
    ఆలోచన , ఇంకా.....
  • 15:15 - 15:16
    ప్రేక్షకులు :ఆచరణ
  • 15:16 - 15:21
    కైలాశ్ సత్యార్థి:కోపం, ఆలోచన, చర్య
    అలా చేయడానికి ప్రయత్నించాను
  • 15:22 - 15:25
    కోపం అనేది ఒక బలం , కోపం అనేది ఒక శక్తి
  • 15:25 - 15:28
    ప్రకృతి నియమమేంటంటే ఆ బలం
  • 15:28 - 15:33
    ఎప్పటికీ సృష్టించబడదు, అంతం కాదు
    ఇంకా నాశనం కాదు ఎప్పటికీ.
  • 15:33 - 15:40
    కనుక కోపంతో వచ్చే బలాన్ని దారి మళ్లించి,
    నియంత్రించి
  • 15:40 - 15:44
    ఒక ఉన్నతమైన ,అందమైన ప్రపంచాన్ని
    ఎందుకు సృష్టించకూడదు?
  • 15:45 - 15:47
    మీ అందరిలోనూ కోపం వుంది
  • 15:47 - 15:53
    కొన్ని క్షణాలపాటు మీతో ఒక రహస్యాన్ని
    పంచుకుంటాను.
  • 15:53 - 16:01
    మనం కనుక సంకుచితమైన అహంకార
    పొరలకే పరిమితమైతే
  • 16:01 - 16:05
    స్వార్థమనే వలయాలతో
  • 16:05 - 16:13
    ఆ కోపం అనేది ద్వేషానికి, హింసకు,
    ప్రతీకారానికి,నాశనానికీ దారితీస్తుంది
  • 16:14 - 16:17
    మనం కనుక ఆ వలయాలను ఛేదిస్తే
  • 16:17 - 16:22
    అదే కోపం మారుతుంది ఒక గొప్పశక్తిగా
  • 16:22 - 16:27
    ఈ వలయాలను మనలోని
    అంతర్గత సంవేదన ద్వారా ఛేధించగలం
  • 16:27 - 16:31
    ఈ సంవేదన ద్వారా ప్రపంచాన్ని మరింత
    మెరుగయ్యేలా అనుసంధానించగలం
  • 16:31 - 16:34
    కోపాన్ని దారి మళ్ళించడంద్వారా సాధించగలం
  • 16:34 - 16:39
    కనుక మిత్రులారా,సోదరసోదరీమణులారా
    ఒక నోబెల్ గ్రహీతగా మరోసారి
  • 16:40 - 16:43
    మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా
  • 16:44 - 16:47
    మిమ్మల్ని కోపం తెచ్చుకొమ్మని అర్థిస్తున్నా
  • 16:48 - 16:52
    మనందరిలో మిక్కిలి కోపిష్ఠి
  • 16:52 - 17:00
    ఎవరంటే అతన్ని కోపాన్ని ఆలోచనగాను,
    ఆచరణగానూ మార్చగలిగేవాడు
  • 17:00 - 17:02
    కృతజ్ఞతలు
  • 17:02 - 17:06
    ( కరతాళ ధ్వనులు )
  • 17:15 - 17:19
    క్రిస్ ఆండర్సన్:చాలా కాలంగా మీరెందరికో స్ఫూర్తి
  • 17:19 - 17:22
    మీకు ప్రేరణ నిచ్చింది ఎవరులేదా ఏది,ఎందుకు?
  • 17:23 - 17:24
    కెయస్: మంచి ప్రశ్న .
  • 17:24 - 17:28
    క్రిస్ , మీకు చెప్తాను , అదే సత్యం,
  • 17:28 - 17:33
    నేనో పిల్లవాడిని విముక్తుని చేసిన ప్రతిసారీ
  • 17:33 - 17:37
    ఆ పిల్లవాడు ఆశలన్నీ వదిలేసుకునివుంటాడు
    అది అతని తల్లిని చేరుకుంటానని,
  • 17:37 - 17:41
    స్వేఛ్చతో కూడిన ఆ తొలి చిరునవ్వు ,
  • 17:41 - 17:44
    ఆ తల్లీ అన్ని ఆశల్నీ వదులుకునివుంటుంది
  • 17:44 - 17:51
    కూతురు లేదా కొడుకు తిరిగి తన ఒడి చేరగలడని
  • 17:51 - 17:53
    వారెంతో ఉద్వేగంగా మారిపోతారు
  • 17:53 - 17:58
    ఆనందంతో ఆమె చెక్కిళ్లపై జారిన
    మొదటి కన్నీటిచుక్క
  • 17:58 - 18:01
    దాంట్లో నేను భగవంతుడ్ని చూస్తాను .
    అదే నాకు పెద్ద ప్రేరణ
  • 18:01 - 18:06
    నేనెంతో అదృష్టవంతుడ్ని,ఎందుకంటే
    ఇంతకుముందు చెప్పినట్లు , కొన్నివేలసార్లు
  • 18:06 - 18:10
    ఆ పిల్లలమొహాల్లో నేను దేవుని దర్శించాను
  • 18:10 - 18:12
    వాళ్ళే నాకు గొప్ప ప్రేరణ .
  • 18:12 - 18:14
    కృతజ్ఞతలు
  • 18:14 - 18:16
    ( కరతాళధ్వనులు )
Title:
కోపం ద్వారా శాంతిని ఎలా తేగలం?
Speaker:
కైలాశ్ సత్యార్థిగారు
Description:

ఉన్నత కులంలో పుట్టిన ఒక యువకుడు భారత దేశంలోని 83,000 మంది పిల్లలను ఎలా దాస్యవిముక్తి చేయగలిగాడు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిగారు ఒక ఆశ్చర్యకరమైన సలహానిస్తున్నారు ఈ ప్రపంచాన్ని మరింత బాగా మార్చాలనుకునే వారి కోసం. అన్యాయం పట్ల కోపం తెచ్చుకోండి అని. ఈ ప్రభావవంతమైన ఉపన్యాసంలో కోపంలోంచి పుట్టిన శాంతిసాధన జీవితాశయంగా ఎలా మారిందీ వివరిస్తున్నారు.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
18:29
Dimitra Papageorgiou approved Telugu subtitles for How to make peace? Get angry
Samrat Sridhara edited Telugu subtitles for How to make peace? Get angry
Samrat Sridhara accepted Telugu subtitles for How to make peace? Get angry
Samrat Sridhara edited Telugu subtitles for How to make peace? Get angry
Samrat Sridhara edited Telugu subtitles for How to make peace? Get angry
vijaya kandala edited Telugu subtitles for How to make peace? Get angry
vijaya kandala edited Telugu subtitles for How to make peace? Get angry
vijaya kandala edited Telugu subtitles for How to make peace? Get angry
Show all

Telugu subtitles

Revisions