Return to Video

ఒక కొత్త సంచలనాత్మక వైర్లెస్ అంతర్జాలము

  • 0:01 - 0:04
    నేను ప్రామాణిక ఆఫ్-ది-షెల్ఫ్
    LED దీపం నుంచి
  • 0:04 - 0:08
    సౌర ఘటం ఉన్న ఒక ల్యాప్టాప్ రిసీవర్ గా
  • 0:08 - 0:12
    పని చేయడం వలన వీడియో ప్రసారం సాధ్యం
  • 0:12 - 0:18
    అని బహిరంగంగా మొదటి సారి
    ప్రదర్శిద్దామని కోరుకుంటున్నాను.
  • 0:18 - 0:21
    వై-ఫై ప్రమేయం లేదు, ఇది కేవలం కాంతి.
  • 0:21 - 0:24
    మరియు మీరు ఆశ్చర్యపోవచ్చు, విషయము ఏమిటి?
  • 0:24 - 0:26
    విషయము ఏమిటి అంటే ఇది:
  • 0:26 - 0:29
    అంతర్జాలంలో ఒక భారీ పొడిగింపు ఉంటుంది
  • 0:29 - 0:32
    డిజిటల్ విభజనను మూసివేయడానికి,
  • 0:32 - 0:36
    మరియు మనము పిలిచే "ఇంటర్నెట్
    ఆఫ్ థింగ్స్"ని అనుమతించడానికి --
  • 0:36 - 0:39
    పదుల బిల్లియన్ల పరికరాలను
    అంతర్జాలంతో అనుసధానించడం.
  • 0:39 - 0:43
    నా దృష్టిలో అవి దాదాపుగా
    విద్యుత్తు తటస్థ ఉంటేనే ,
  • 0:43 - 0:46
    ఇంటర్నెట్ పొడిగింపు పని చేయవచ్చు.
  • 0:46 - 0:51
    దీని అర్థం మనము సాధ్యమైనంత ప్రస్తుతమున్న
    మౌలిక సదుపాయాలను ఉపయోగించడం అవసరం .
  • 0:51 - 0:56
    మరియు దీనిలోనే సౌర ఘటం
    మరియు LED లు ఉపకరిస్తాయి
  • 0:57 - 0:59
    నేను మొదటి సారిగా 2011 లో
  • 0:59 - 1:01
    టెడ్ లో లై - ఫై లేదా
  • 1:01 - 1:03
    లైట్ ఫిడిలిటీ గురించి వెల్లడించాను.
  • 1:04 - 1:10
    లి-ఫై డేటా ఆఫ్-ది-షెల్ఫ్ LED లను
    ఉపయోగించుకొని చాలా వేగంగా,
  • 1:10 - 1:13
    భద్రంగా మరియు సురక్షితంగా
    డేటాని ప్రసారం చేస్తుంది.
  • 1:13 - 1:16
    డేటాలో సూక్ష్మమైన మార్పులను
  • 1:16 - 1:19
    క్రోడీకరించి కాంతి ద్వారా
    రవాణా చేయబడుతుంది.
  • 1:20 - 1:24
    మనము చుట్టూ చూస్తే, మన
    చుట్టూ అనేక LED లు ఉన్నాయి,
  • 1:24 - 1:29
    కాబట్టి మన చుట్టూ లి-ఫై ట్రాన్స్మిటర్లు
    ఉన్న పెద్ద మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
  • 1:29 - 1:35
    కానీ ఇప్పటివరకు, చిన్న ఫోటో డిటెక్టర్లు
    వంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించి
  • 1:35 - 1:38
    డేటాలో క్రోడీకరించిన సమాచారం తీసుకున్నాము.
  • 1:39 - 1:43
    నేను ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు
    ఉపయోగించి లై ఫై దీపాల నుండీ డేటా రప్పించే
  • 1:43 - 1:46
    ఒక మార్గం కనుక్కుందామని అనుకున్నాను.
  • 1:46 - 1:51
    మరియు అందుకే నేను సౌర ఘటాలు
    మరియు సౌర ఫలకాలను పరిశీలిస్తున్నాను.
  • 1:51 - 1:56
    ఒక సౌర ఘటం కాంతిని పీల్చుకొని మరియు
    దాన్నివిద్యుత్ శక్తి గా మారుస్తుంది.
  • 1:57 - 2:02
    అందుకే మనము ఒక సౌర ఘటం ఉపయోగించి
    మన మొబైల్ ఫోన్ను చార్జ్ చేస్కోవచ్చు.
  • 2:02 - 2:03
    కానీ మనము గుర్తున్చుకోవలసింది
  • 2:03 - 2:09
    ఉంచుకోవాలి అదేమిటంటే డేటాను,LED కాంతియొక్క
    సూక్ష్మమైన మార్పులుగా క్రోడీకరించాము,
  • 2:09 - 2:13
    కాబట్టి లోనికి వచ్చే కాంతి
    హెచ్చుతగ్గులకు గురయితే
  • 2:13 - 2:16
    అదే విధంగా సౌర ఘటం నుండి
    అందే శక్తి కూడా మారుతుంది.
  • 2:17 - 2:20
    దీని అర్ధం మన వద్ద కాంతి నుండి మరియు
    సౌర ఘటానికి సమాచారం
  • 2:20 - 2:26
    అందుకోవటానికి ప్రధానమైన విధానం ఉన్నది,
  • 2:26 - 2:29
    ఎందుకంటే అందే శక్తిలో హెచ్చుతగ్గులకు
  • 2:29 - 2:31
    అనుగుణంగా డేటా బదిలీ ఉంటుంది.
  • 2:32 - 2:34
    నిస్సందేహంగా ప్రశ్న ఏమిటంటే:
  • 2:34 - 2:38
    మనము చాలా వేగంగా మరియు కాంతిలో కలిగే
    సున్నితమైన మార్పులను
  • 2:38 - 2:42
    అంటే మన LED లైట్లు వ్యాప్తి చేసే
    వంటివి అందుకోగలమా?
  • 2:43 - 2:46
    మరియు దాని జవాబు అవును, మనం చేయగలం.
  • 2:47 - 2:48
    మనము ఒక ప్రామాణికమైన ఆఫ్-ది-షెల్ఫ్
  • 2:48 - 2:52
    సౌర ఘటం నుండి సెకనుకు 50 మెగాబైట్ల వరకు
  • 2:52 - 2:54
    అందుకోవచ్చు అని ప్రయోగశాలలో చూపాము.
  • 2:55 - 2:59
    మరియు ఈ రోజుల్లో చాలా బ్రాడ్బాండ్
    కనెక్షన్ల కంటే వేగంగా ఉంది.
  • 2:59 - 3:03
    ఇప్పుడు నన్ను మీకు ఆచరణలో
    చూపించడానికి వీలు కల్పించండి.
  • 3:05 - 3:09
    ఈ పెట్టె లో ఒక ప్రామాణికమైన,
    ఆఫ్-ది-షెల్ఫ్ LED దీపం ఉంది.
  • 3:11 - 3:14
    ఇది ఒక ప్రామాణికమైన
    ఆఫ్-ది-షెల్ఫ్ సౌర ఘటము;
  • 3:14 - 3:16
    ఇది లాప్టాప్ కు అనుసంధానించబడింది.
  • 3:17 - 3:19
    మరియు మన వద్ద సౌర ఘటం నుండి
  • 3:19 - 3:23
    అందే శక్తి చూసేందుకు
    ఇక్కడ ఒక పరికరము ఉంది.
  • 3:23 - 3:26
    మరియు ఈ పరికరం
    ఈ సమయంలో ఏదో చూపిస్తోంది.
  • 3:26 - 3:30
    ఎందుకంటే సౌర ఘటం ఇప్పటికే యాంబియంట్
    కాంతి నుండి వెలుతురు తీసుకొని ఉంది.
  • 3:31 - 3:34
    ఇప్పుడు మొదట ఏమి చేద్దామని
    అనుకున్నది లైట్ స్విచ్ ఆన్ చేయడం.
  • 3:34 - 3:36
    మరియు నేను కేవలం
    లైట్ స్విచ్ ఆన్ చేస్తాను,
  • 3:36 - 3:38
    ఒక క్షణం,
  • 3:38 - 3:42
    మరియు మీరు ఆ పరికరము కుడి
    వైపుకు దుమికినట్లుగా గమనిస్తారు.
  • 3:43 - 3:45
    కనుక సౌర ఘటం, ఒక క్షణం,
  • 3:45 - 3:48
    ఈ కృత్రిమ కాంతి మూలం
    నుండి శక్తిని అందుకుంటుంది.
  • 3:49 - 3:52
    నేను ఇది ఆపివేస్తే, ఇది పడిపోవడం చూస్తాము.
  • 3:52 - 3:53
    నేను దానిని ఆన్ చేస్తే.
  • 3:53 - 3:56
    కాబట్టి మనము సౌర ఘటం
    నుండి శక్తిని అందుకుంటాము.
  • 3:57 - 4:02
    కానీ తరువాత వీడియోని ప్రసారం చేయడానికి
    ప్రేరేపిద్దామని అనుకుంటున్నాను.
  • 4:03 - 4:06
    మరియు నేను ఇది ఒక బటన్
    నొక్కడం ద్వారా చేశాను.
  • 4:06 - 4:10
    కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ LED
    దీపం చాలా సూక్ష్మ విధంగా
  • 4:11 - 4:15
    LED ప్రకాశం మార్చడం ద్వారా
    ఒక వీడియోని ప్రసారం చేస్తోంది,
  • 4:15 - 4:17
    మరియు మీరు ఒక రకంగా
    మీ కన్నుతో గుర్తించలేరు,
  • 4:17 - 4:20
    ఎందుకంటే మార్పులు గుర్తించ తగ్గ
    వేగం కన్నాఎక్కువ ఉండడం.
  • 4:21 - 4:24
    కానీ ఈ విషయాన్ని నిర్ధారించటానికి,
  • 4:24 - 4:27
    నేను సౌర కణాల కాంతిని నిరోధించగలను.
  • 4:28 - 4:31
    కాబట్టి ముందుగా మీరు శక్తి
    అందటం తగ్గటం గమనిస్తారు
  • 4:31 - 4:33
    మరియు వీడియో కూడా ఆగుతుంది.
  • 4:33 - 4:37
    నేను ఈ ప్రతిష్టంభన తొలగిస్తే, వీడియో
    పునఃప్రారంభించబడుతుంది.
  • 4:37 - 4:44
    (చప్పట్లు)
  • 4:44 - 4:46
    మరియు నేను దాన్ని తిరిగి చేయగలను.
  • 4:46 - 4:51
    కాబట్టి మనము వీడియో ప్రసార ఆపితే
    శక్తి అందటం కూడా అలాగే ఆగుతుంది.
  • 4:51 - 4:56
    కాబట్టి ఆ సౌర ఘటం ఒక రిసీవర్ గా
    పనిచేస్తుందని చూపుతోంది.
  • 4:56 - 5:01
    కానీ ఇప్పుడు ఈ LED దీపం ఒక వీధి కాంతి
    మరియు అక్కడ మంచు ఉంది అని ఊహించండి.
  • 5:02 - 5:04
    ఆపై నేను పొగమంచును చైతన్య
    పరచాలనుకుంటున్నాను,
  • 5:04 - 5:07
    అందుకే నేను నాతో ఒక రుమాలు తెచ్చాను
  • 5:07 - 5:09
    (నవ్వులు)
  • 5:09 - 5:13
    మరియు నన్ను సౌర కణముపై
    ఒక చేతి రుమాలు పెట్టనివ్వండి.
  • 5:14 - 5:16
    ముందుగా అనుకున్నట్టుగా
  • 5:16 - 5:20
    అందుకున్న శక్తి తగ్గటం, కానీ విడియో
    ప్రసారం వస్తూ ఉండడం
  • 5:20 - 5:22
    మీరు ముందు చూస్తారు.
  • 5:23 - 5:25
    దీని అర్థం, అవరోధం ఉన్నప్పట్టికీ,
  • 5:25 - 5:29
    సరిపడినంత కాంతి చేతి రుమాలు ద్వారా
    సౌర కణానికి ప్రసారమవుతోంది,
  • 5:29 - 5:35
    కాబట్టి సౌర ఘటం, ఈ సందర్భంలో,
    ఒక అధిక నిర్వచనం వీడియోని
  • 5:35 - 5:37
    క్రోడీకరించి సమాచారం
    ప్రసారం చేయగలుగుతోంది.
  • 5:39 - 5:45
    ఇక్కడ నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే
    ఒక సౌర ఘటం కాంతిలో కోడీకరించిన
  • 5:45 - 5:48
    బాగా వేగవంతమైన వైర్లెస్ సంకేతాలు
    అందుకోవటానికి ఒక రిసీవర్ గా మారింది,
  • 5:48 - 5:53
    ఐతే ఇది శక్తిని గ్రహించే పరికరముగా
    తన ప్రాథమిక విధి నిర్వహిస్తోంది.
  • 5:54 - 5:56
    అందుకే ప్రస్తుతమున్న సౌర కణాలను
  • 5:56 - 6:00
    ఒక గుడిసె పైకప్పు పై ఉంచితే
    అది బ్రాడ్బాండ్ రిసీవర్ గా
  • 6:00 - 6:03
    దగ్గరలో ఉన్నఒక లేజర్ స్టేషన్ నుంచో
  • 6:03 - 6:07
    లేక నిజంగా దీపపు స్తంభము
    లాగానో పని చేస్తుంది.
  • 6:08 - 6:11
    మరియు పుంజం సౌర ఘటాన్ని ఎక్కడ తాకుతుంది
    అన్న్దది అంత ముఖ్యమైనది కాదు.
  • 6:12 - 6:13
    మరియు అదే నిజము
  • 6:13 - 6:17
    విండోస్ లోకి విలీనం అయ్యే
    అపారదర్శక సౌర కణాలు,
  • 6:17 - 6:20
    వీధి ఫర్నిచర్ లో సోలార్
    సెల్స్ సంకలనము
  • 6:20 - 6:25
    లేదా నిజానికి, సోలార్ సెల్స్ ఈ లక్షలాది
    పరికరాలలో విలీనం కావడం
  • 6:25 - 6:27
    వలన Internet of Things రూపం వస్తుంది.
  • 6:27 - 6:28
    కేవలం ఎందుకంటే,
  • 6:28 - 6:31
    మేము క్రమం తప్పకుండా ఈ పరికరాలు
    చార్జ్ చేయకూడదని,
  • 6:31 - 6:34
    పైపెచ్చు, కొన్ని నెలల తర్వాత
    బ్యాటరీలు మార్చాలి.
  • 6:34 - 6:36
    నేను మీకు చెప్పినట్లుగా,
  • 6:36 - 6:38
    నేను దీన్ని బహిరంగంగా
    మొదటి సారి చూపిస్తున్నాను.
  • 6:39 - 6:41
    ఇది చాలా వరకు ఒక ప్రయోగశాల ప్రదర్శన,
  • 6:41 - 6:42
    ఒక నమూనా.
  • 6:42 - 6:46
    కానీ నేను మరియు నా జట్టు, దీన్ని
    మార్కెట్ లోకి వచ్చే రెండు నుంచి మూడు
  • 6:46 - 6:48
    ఏళ్ళలో తీసుకువెళ్ళగలమని
    నమ్మకంగా ఉన్నాము
  • 6:48 - 6:54
    మరియు మేము డిజిటల్ విభజన తగ్గించడానికి
    దోహదం చేయగలమని ఆశిస్తున్నాము,
  • 6:54 - 6:55
    మరియు ఈ బిలియన్ల
  • 6:55 - 6:58
    పరికరాలు అంతర్జాలంలో అనుసంధానం
    చేయడానికి దోహదపడుతున్నాము.
  • 6:58 - 7:00
    మరియు ఇవి అన్నీ కూడా
  • 7:00 - 7:02
    ఒక భారీగా శక్తి వినియోగం
    యొక్క విస్ఫోటము లేకుండా --
  • 7:02 - 7:05
    సౌర కణాల వలన ఇది
    విరుధ్ధంగా జరుగుతోంది.
  • 7:05 - 7:06
    ధన్యవాదములు.
  • 7:06 - 7:11
    (చప్పట్లు)
Title:
ఒక కొత్త సంచలనాత్మక వైర్లెస్ అంతర్జాలము
Speaker:
హెరాల్డ్ హాస్
Description:

మనం ఇప్పటికే ఉన్న సాంకేతికతను ఉపయోగించుకొని మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో నివసిస్తున్న 4 బిలియన్ కంటే ఎక్కువ ప్రజలకు అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఆఫ్-ది-షెల్ఫ్ LEDలు మరియు సౌర ఘటాలు ఉపయోగించుకొని హెరాల్డ్ హాస్ మరియు అతని జట్టు కాంతిని ఉపయోగించి డేటాను ప్రసారం చేయడానికి ఒక కొత్త సాంకేతిక పరిజ్ఙానాన్ని కనుగొన్నారు మరియు ఇది డిజిటల్ డివైడ్ తగ్గించడానికి మూలము అవవచ్చు. భవిష్యత్తులో అంతర్జాలము ఎలా ఉండవచ్చో ఒక సారి చూడండి.

more » « less
Video Language:
English
Team:
closed TED
Project:
TEDTalks
Duration:
07:24

Telugu subtitles

Revisions