పెరిగే వయస్సులో నేను చాలా ఇష్టంగా
దాగుడుమూతలు ఆడేదాన్ని
ఒకసారి అనుకున్నాను చెట్టుపైకి ఎక్కుతే
నన్నెవరూ కనుక్కోలేరని
కానీ జారిపడి భుజం విరగ్గొట్టుకున్నాను
నిజానికి నేను ఒళ్లంతా దెబ్బలతో
మొదటి తరగతిలో చేరాను
కోలుకోడానికి ఆరువారాలు పట్టింది కానీ,
మోచేతిని బాగా ఎత్తలేకపోయేదాన్ని
దాన్ని ముడవడానికి , చాచడానికి
ఆభ్యాసాలు చేయాల్సివచ్చేది
వారానికి ఏడురోజుల చొప్పున రోజుకి వందసార్లు
బొటాబొటీగా చేసాను , ఎందుకంటే అది
బాధాకరంగా, చిరాగ్గానూ వుండేది
ఫలితంగా కోలుకోడానికి మరో ఆరువారాలుపట్టింది
చాలా సంవ.తర్వాత మా అమ్మకు
భుజం బిగుసుకపోయింది
దాంతో నొప్పి, భుజం పట్టేసింది
అసాధారణశక్తులున్నాయని నా జీవితంలో
సగ భాగం పైగానమ్మిన వ్యక్తికి
హఠాత్తుగా బట్టలు మార్చుకోడానికి, కూరలు
తరగడానికీ సహాయం అవసరమైంది
ఆమె ప్రతీవారం చికిత్స కోసం వెళ్ళేది
కానీ , నాలాగే
ఇంట్లో చేసే అభ్యాసాలను అశ్రధ్ధ చేసేది
దాంతో మెరుగవడానికి 5నెలల కంటే
ఎక్కువ సమయం పట్టింది
మాఅమ్మకు ,నాకూ ఫిజికల్ చికిత్స అవసరమైంది
అంటే నిర్దేశించిన ఆభ్యాసాలను
మళ్ళీమళ్ళీ చేయడం
ప్రమాదం లేదా గాయం ద్వారా కోల్పోయిన
కదలికల స్థాయిని తిరిగి పొందడానికై
తొలుత థెరపిస్ట్ రోగులతో కలిసి చేస్తాడు
తరువాత రోగులు ఈ అభ్యాసాలను
ఇంట్లో చేయాల్సి వుంటుంది
కానీ రోగులు ఈఅభ్యాసాలను విసుగు,
నిరాశ, గజిబిజిగా భావిస్తారు
ఫలితం కోసం చాలా రోజులు చేయాల్సివుంటుంది
బాధేంటంటే రోగుల నిరాకరణ 70% పైగా వుంటుంది
చాలామంది రోగులు అభ్యాసాలు చేయరని దానిఅర్థం
దాంతో గుణం కన్పించడానికి చాలా
సమయం పడ్తుంది
ఫిజికల్ చికిత్సకులు అంగీకరిస్తారు
ఈ ప్రత్యేక అభ్యాసాలు
కోలుకోడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తాయి
కానీ రోగులు ఇవి చేయడానికి తగిన
ఉత్సాహాన్ని చూపించరు
అందువల్ల కంప్యూటర్ ప్రావీణ్యం ఉన్న
ముగ్గురం స్నేహితులం కలిసి
మాకు మేం ప్రశ్నించుకున్నాం
రోగులు ఆడుతూ, పాడుతూ కోలుకుంటే
ఉత్సాహంగా వుంటుంది కదాఅని
మేం MIRA అనే సాఫ్ట్వేర్ వేదికను
తయారుచేడం మొదలుపెట్టాం
అది కైనటిక్ పరికరాన్ని కదలికలను
చిత్రీకరించే కెమెరాను వాడుతూ
సాంప్రదాయిక అభ్యాసాలను వీడియో
గేమ్ లా మార్చివేస్తుంది
నా ధెరపిస్ట్ నా ప్రత్యేక చికిత్స కోసం
షెడ్యూల్ ను సిధ్ధం చేసాడు
ఇదెలా వుంటుందో చూద్దాం
మొదటి ఆట లో నేనొక తుమ్మెదను
పైకి, కిందికి ఎగిరేలా చేయాలి
పుప్పొడిని సేకరించి,తేనె పట్టులో దాచేందుకు
ఇదంతా ఇతర పురుగులను దూరం పెడుతూ చేయాలి
మోచేతిని ముడుస్తూ ,చాచుతూ నేను
ఈగను నియంత్రించాను
సరిగ్గా నా ఏడేళ్ల వయస్సులో ప్రమాదం
జరిగినప్పుడు చేసినట్లుగానే
ఈ ఆటను రూపొందించే సమయంలో మొదటగా
ఫిజియోథెరపిస్ట్ తో మాట్లాడాం
రోగులకు కావల్సిన కదలికలను
అర్థం చేసుకోడానికై
తరువాతే వీడియో గేం చేసాము
రోగులకు సులభంగా, ప్రేరణాత్మకంగా, సరళంగా
చేయగలిగే లక్ష్యాలను అందించడానికి
కానీ ఈ సాఫ్ట్ వేర్ చాలా వ్యక్తిగతమైనది
ఫిజికల్ థెరపిస్ట్ లుకూడా వారి స్వంత
అభ్యాసాలను సృష్టించవచ్చును
ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి నా థెరపిస్ట్
పట్టేసిన భుజం కదలికలను రికార్డ్ చేసాడు
మా అమ్మ చేయాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి
ఆమెకు ఫ్రోజెన్ షోల్డర్
సంభవించినప్పుడు
మా చికిత్సకుని అభ్యాసాలను తెరపై
ఎడం వైపు చూస్తూ
అతని సలహాలపై అవే కదలికలను కుడి వైపు
చేస్తూ చూడగలను
నేను మరింత శ్రధ్ధతో,ఆత్మ విశ్వాసంతో చేసాను
థెరపిస్ట్ ప్రక్కనుండగా చేస్తున్నట్లుగా
థెరపిస్ట్ నాకు తగినవని సూచించిన అభ్యాసాలనే
మౌలికంగా ఇది థెరపిస్ట్ ల కార్యకలాపాలకు
కొనసాగింపుమాత్రమే
రోగికి ఏవైతే ఉచితమనుకుంటారో
ఆ అభ్యాసాలను సృష్టించడానికై
పడిపోవడం నివారించడానికై
సిధ్దం చేసిన ఇంటి వేలం ఆట
కండరాలను ధృఢం చేస్తూ, నడకలో
సమతౌల్యం సాధించడానికితయారుచేసింది
ఒక రోగిగా నేను కూర్చొనే , నిలబడే
కదలికలను చేయాల్సి వుంటుంది
ఇంకా నేను నిల్చున్నప్పుడు
అవసరమైనవాటిని కొనేటప్పుడు
( నవ్వులు )
ఇంకో రెండు రోజుల్లో మా బామ్మకు
82 సంవ. వయస్సు వస్తుంది
80 ఏళ్ళు దాటిన వారిలో 50 % అవకాశముంటుంది
సంవత్సరంలో ఒకసారైనా పడిపోవడానికి
దాంతో తొడఎముక విరగడమో ఇంకా
తీవ్రంగా కూడా వుండవచ్చు
కండరాల బలహీనత,శరీరంలో అసమతుల్యత
పడిపోవడానికి ముఖ్య కారణాలు
ఐతే నిర్ణీత అభ్యాసాలతో
ఈ సమస్యలను తగ్గించవచ్చు
మా బామ్మ లాంటి వృధ్ధులకు ఇవి
సహాయం చేస్తాయి
సురక్షితంగా , స్వతంత్రంగా వుండడానికై
నా ప్రణాళిక పూర్తయ్యేసరికి
మీరా క్లుప్తంగా చూపించింది
ఈ సెషన్ ద్వారా నేనెంత కోలుకున్నానో
మీకు మూడు ఆటలను మాత్రమే చూపించాను
అవి పిల్లలకు, వయోజనులకు, వృధ్ధులకు
వీటిని ఎముకల , నరాల రోగులకు కూడా వాడవచ్చు
త్వరలో ఆటిజం తో బాధపడే పిల్లలకోసం
కూడా సిధ్ధమౌతున్నాయి
మానసిక ఆరోగ్యం , లేదా ఉచ్చారణా శిక్షణ
నా థెరపిస్ట్ నా ప్రొఫైల్ లోకి వెళ్ళగలడు
నా సెషన్లకు సంబంధించిన వివరాలను చూడగలడు
నా కదలికల సంఖ్యను, గుణాత్మకతను చూడగలదు
నా జాయింట్ల ను ఎంత వేగంగా కదిలిస్తున్నానో
వంటివి కూడా
నా ఫిజికల్ చికిత్సకుడు వీటిని
నా చికిత్సలో భాగం చేయగలడు
ఈ వెర్షన్ ఉపయోగంలో వుండడం
నాకెంతో ఆనందాన్నిస్తోంది
Europe, USలలో 10 కంటే ఎక్కువ
క్లినిక్ లలో వాడబడుతోంది.
మేము home version ను సిధ్దం చేస్తున్నాము
ఫిజికల్ థెరపిస్ట్ లు ఈ డిజిటల్ చికిత్సను
సూచించేలా పటిష్ఠపరుస్తున్నాము
రోగులు ఇంట్లో ఆడుతూపాడుతూ కోలుకోవాలని కూడా
నాకు మాఅమ్మకు చికిత్స సమయంలో
ఇలాంటి సాధనం వుండివుంటే
చికిత్స ను మరింత సమర్థవంతంగా
ఉపయోగించుకునేవాళ్ళము
బహుశా తొందరగా కోలుకునేవాళ్ళము కూడా
కృతజ్ఞతలు
(చప్పట్లు)
టాం రైలీ: అయితే కాస్మిన్,ఇదెలాంటి
hardware చెప్పండి
ఇది వేగంగా విస్తరిస్తోంది?
ఇది దేనితో తయారయ్యింది , దీని వెల ఎంత?
కాస్మిన్ మిలావ్ :
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 3
ప్రదర్శన కోసమే ఇది అయితే కేవలం
మీకో కంప్యూటర్ ,కైనెక్ట్ కావాలి
దానిధర 120 డాలర్లు Tr:కైనెక్ట్ అంటే
జనం వారి Xboxes కోసం వాడేది
3D ఆటలు ఆడడానికి ,అదేనా
CM: సరిగ్గాఅదే,కాని మీకు Xbox అవసరంలేదు
కేవలం మీకో కెమెరా కావాలి
TR: అయితే ఇది 1000 $ కంటే
తక్కువలో వచ్చే పరిష్కారం
CM:ఖచ్చితంగా, 400డాలర్లే.
మీరు తప్పక వాడవచ్చు
TR: ప్రస్తుతం మీరు క్లినిక్ లలో
పరిశోధనలు చేస్తున్నారు
CM: అవును
TR:వస్తుందని ఆశిద్దాం
అయితే ఇది home version అన్నమాట
నా వ్యాయామాన్ని remoteతో చేయవచ్చు
అప్పుడు థెరపిస్ట్ క్లినిక్ లో నేను
ఎలా చేసేది, ఏం చేసేదీ చూడొచ్చు
CM: సరిగ్గా అలాగే
TR: బావుంది. కృతజ్ఞతలు,
CM: ధన్యవాదాలు
(చప్పట్లు )