మీలో ఎంతమంది ఫేస్బుక్ నుంచి తమ స్నేహితుల లిస్టు నుంచి ఎవర్నైనా తొలగించారు .. చేతులెత్తండి కారణం వారు రాజకీయాలు, లేదా మతం, పిల్లలపెంపకం లేదా ఆహారం గురించి ఆక్షేపణగా చెప్పడమే. ( నవ్వులు ) మీలో ఎందరు కనీసం ఒకరికి దూరంగా ఉండాలనుకుంటున్నారు కారణం మీరు వారితో మాట్లాడాలనుకోకపోవడమే ( నవ్వులు ) మీకు తెలుసు సున్నితంగా సంభాషణ కొనసాగాలంటే మనం మై ఫెయిర్ లేడీ లో హెన్రీ హిగిన్స్ ఇచ్చిన సలహాను పాటిస్తే చాలు ఆరోగ్యాన్ని దృష్టి లో వుంచుకోవాలి. ఈ రోజుల్లోవాతావరణ మార్పులు, ఏంటివాక్సింగ్ వంటివిషయాలు-- ( నవ్వులు ) రెండూ సురక్షితం కావు కనుక మనముంటున్న ఈ లోకంలో ప్రతీ సంభాషణా వాదనగా మారే అవకాశముంది. ఎక్కడైతే మన పొలిటీషియన్లు పరస్పరం మాట్లాడుకోలేరో చివరికి అతి చిన్న విషయాలపట్ల కూడా అసాధారణ రీతిలో అనుకూలంగానో,వ్యతిరేకంగానో కొట్టుకుంటూ ఉంటారో అది సాధారణం కాదు. పదివేలమంది అమెరికా వయోజనులతో Pew రీసర్చి ఒక అధ్యయనం చేశారు. దాని ప్రకారం ఈ కాలంలో మనం చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా మరింతగా దూరమయ్యాము. మరింతగా విడిపొయ్యాము. మనం రాజీకి ఇష్టపడటం లేదు, దానర్థం మనం ఇంకోరి మాటను వినడం లేదు. ఎక్కడుండాలో నిర్ణయించుకుంటున్నాం. ఎవర్ని పెళ్లాడాలో,ఎవరితో స్నేహం చేయాలో మన నమ్మకాల ఆధారంగా. మనం ఒకరి మాట మరొకరు వినడం లేదు. సంభాషణ అంటే భాషణ శ్రవణాల సంతులనమే, ఎక్కడో ఓ చోట ఈ సంతులనాన్ని కోల్పోయాం. దీనికి టెక్నాలజీ కొంత కారణం. ఈ స్మార్ట్ ఫోన్లు ఐతే మీ చేతుల్లో లేదా మీ చేతికందేంత దూరంలో ఉంటాయి. ఈ Pew రీసర్చి ప్రకారం, 3 వంతులమంది అమెరికా యువతరోజుకు 100 కు పైగా ఫోన్లో మెసేజ్ లను పంపుతుంటారు చాలామంది ,దాదాపుగా అందరూ స్నేహితులకు text చేయడానికే ఇష్టపడుతారు ముఖాముఖి మాట్లాడటం కన్నా. The Atlantic. లో ఓ గొప్పఅంశముంది. పాల్ బార్న్ వెల్ అనే హైస్కూల్ టీచర్ చే అది రాయబడింది. ఆయన విద్యార్థులకు భావ ప్రసారాలపై ఒక ప్రాజెక్ట్ నిచ్చారు. నోట్స్ పై ఆధారపడకుండా ఒక అంశం పై ఎలా మాట్లాడాలో నేర్పాలనుకున్నాడు ఆయనిచ్చిన అంశం" నేను తెలుసుకున్నదేంటంటే" ( నవ్వులు ) నేను గ్రహించిదేంటంటే సంభాషణా సామర్థ్యం చాలాసార్లు నిర్లక్ష్యం చేసే ముఖ్యఅంశం మేము కూడా సరిగ్గా నేర్పలేకపోతున్నాం పిల్లలు ఐడియాలతో తెరలపై గంటలకొద్దీ గడుపుతుంటారు వారికి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి సంభాషణా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోడానికి. ఈ ప్రశ్న చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది కాని మనల్ని మనం వేసుకోవాలి సందర్భశుధ్దితో, పొందికతో సంభాషణను కొనసాగించడాన్ని మించింది ఈ శతాబ్దంలో ఏదైనా నైపుణ్యం ఉందా?" అని. ఇప్పుడు ప్రజల్తో మాట్లాడటమే నా బ్రతుకుతెరువు: నోబుల్ గ్రహీతల్నించి లారీ డ్రైవర్లదాకా కోటీశ్వరులనుంచి, కిండర్గార్టెన్ టీచర్లు ప్రభుత్వాధికారుల్నించి, ప్లంబర్ల దాకా నేను ఇష్టపడేవారితో మాట్లాడతాను ఇష్టపడని వారితోనూ మాట్లాడుతాను నేను మాట్లాడే కొందరితో వ్యక్తిగత స్థాయిలో తీవ్రంగా విభేధిస్తాను కూడా అయినా గొప్ప సంవాదాలున్నాయి వారితో. రాగల 10 నిము.ఎలా మాట్లాడాలో నేర్పాలనుకుంటున్నాను ఎలా వినాలో కూడా దీనిగూర్చి మీలో చాలామంది బోలెడన్ని సలహాలు వినే వుంటారు ఎదుటి వారి కళ్లల్లో చూస్తూ మాట్లాడాలి లాంటివి చర్చిండానికి మంచి అంశాలను ముందుగానే ఆలోచించిపెట్టుకోవాలి లాంటివి మీరు వింటున్నట్లు తెలియడానికి చూడండి,నవ్వండి,తలఊపండి విన్నదాన్ని మళ్లీ చెప్పండి లేదా సారాంశాన్నైనా మీరివన్నింటినీ మరిచిపోండి ఇదంతా చెత్త. ( నవ్వులు ) మీరు నిజంగా ఏకాగ్రతతో వింటూ ఉంటే శ్రధ్ద తో వింటున్నట్లు చెప్పడాన్ని నేర్చుకోవడంలో అర్థం లేదు ( నవ్వులు ) ( కరతాళధ్వనులు ) ఇప్పుడు నేను ప్రొఫెషనల్ ఇంటర్వ్యూయర్ నైపుణ్యాలను వాడుతున్నాను దీన్ని నేను నిజజీవితంలో పాటిస్తాను ప్రజల్ని ఎలా ఇంటర్వ్యూ ఎలా చేయాలో ఇప్పుడు నేర్పుతాను అది మీలోని సంభాషణా చాతుర్యాన్ని మరింత వృధ్ది చేస్తుంది బోర్ కొట్టకుండా, మీ సమయం వృధా కాకుండా, ఎవర్నీ నొప్పించకుండా సంభాషణ చేసే నైపుణ్యాన్ని పెంచుకోండి. మనందరం గొప్పగా మాట్లాడుతుండవచ్చు ఎన్నోసార్లు మాట్లాడివుండవచ్చు అది ఎలా వుంటుందో తెలుసు ఎలాంటి సంభాషణంటే మీరు ఉత్తేజితులై, మనసు నిండిన భావనతో బయటికి వస్తారు లేదా నిజమైన బంధాన్ని ఏర్పరచుకున్నానని భావిస్తారు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నామనుకుంటారు. అది కారణం చెప్పలేని స్థితి మన సంభాషణలు అలా వుండవెందుకుని నావద్ద 10 ప్రాథమిక నియమాలున్నాయి వాటిని మీకు పరిచయం చేస్తాను నిజాయితీగా అందులో ఒక్కటైనా ఎంచుకుని ప్రావీణ్యాన్ని సంపాదించండి ఇప్పటికే మంచి సంభాషణల్ని ఆనందిస్తున్నారు మొదటిది: ఒకే సమయంలో అనేక పనులను చేయకండి సెల్ ఫోన్లను పక్కకు పెట్టమని నా ఉద్దేశ్యం కాదు మీ చేతులోని టాబ్ , కారుతాళాలు ఏవైనా పక్కన పెట్టండి. నా ఉద్దేశం వర్తమానంలో జీవించండి ఈ క్షణంలో బ్రతకండి బాస్ తో చేసిన వాగ్వాదం గూర్చి ఆలోచించకండి ఈ రాత్రి భోజనం గూర్చి చింతించకండి సంభాషణ నుంచి తప్పుకోవాలంటే పాలుపంచుకోకండి కానీ సగం ఇటు సగం అటుగా వుండకండి రెండవది: ప్రధాన పాత్ర వహించకండి మీ అభిప్రాయాన్ని వెల్లడించాలనుకుంటే మీ మాటల్ని వెనక్కుతీసుకునేలా,వివాదాన్ని పెంచే అవకాశాన్ని ఇవ్వకండి ఒక బ్లాగ్ వ్రాయండి ( నవ్వులు ) పండితులను నా షో కు రానివ్వకపోడానికి ఓ గొప్పకారణముంది ఎందుకంటే వారు విసుగు పుట్టిస్తారు వారు సంప్రదాయవాదులైతే ఒబామాను, ఫుడ్ స్టాంపుల్ని అబార్షన్లను వ్యతిరేకిస్తారు ఉదారవాదులైతే పెద్దబ్యాంక్ లను ,ఆయిల్ కార్పొరేషన్ లను అసహ్యించుకుంటారు వారిని అంచనావేయొచ్చు మీరలా వుండాలనుకోడం లేదు ప్రతి సంభాషణతో మీరో విషయం నేర్చుకోవచ్చని ఊహించుకోండి పేర్గాంచిన చికిత్సకుడు M. Scott Peck ఇలా అన్నారు నిజంగా వినాలంటే మీ అహాన్ని ప్రక్కకు జరపాలి దానర్థం కొన్నిసార్లుమీ స్వంత అభిప్రాయాలను పక్కన బెట్టాలి ఈ అంగీకారం వల్ల వక్తకు ఎదురుదాడి అవకాశం తగ్గుతుంది శ్రోతకు అతని అంతరంగం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మళ్ళీ మీరో విషయాన్ని నేర్చుకుంటున్నానని ఊహించుకోండి Bill Nye: మీరు కలిసే ప్రతీవ్యక్తీ మీకు తెలీని విషయంలో నిపుణుడైవుంటాడు దీన్ని ఇంకోలా వివరిస్తాను ప్రతీవారు ఏదో విషయంలో నేర్పరి మూడవది.open-ended questions ని వాడండి ఈ విషయంలో పత్రికా రచయితల సలహా తీసుకోండి మీ ప్రశ్నల్ని ఎవరు,ఎప్పుడు,ఎక్కడ, ఎందుకు లేదా ఎలా తో మొదలెట్టండి జటిలమైన ప్రశ్నలడిగితే సులువైన జవాబులొస్తాయి మీరు భయపడ్డారా అని అడిగితే మీ జవాబు లో తీవ్రత వుంటుంది అయితే అవును భయపడ్డాను ,లేదా కాదు అని మీరు కోపంగా వున్నారా? అవును నేను చాలా కోపంగా వున్నాను వారినే వివరించమనండి ఎందుకంటే వారికే బాగా తెలుసు ఎలాంటి భయం? లాంటి ప్రశ్నలడగండి "మీకెలా అన్పించింది?" కారణం వారప్పుడో నిముషం ఆగి దాన్ని గూర్చి ఆలోచిస్తారు అప్పుడు మీకో ఆసక్తికరమైన జవాబు దొరుకుతుంది నాల్గవది: సంభాషణా ప్రవాహంలో సాగండి దానర్థం మీ మనస్సులో ఆలోచనలు వస్తుంటాయి వాటిని మనస్సులోంచి బయటికి పంపాలి మేం ఇంటర్వ్యూలలో తరచుగా వింటుంటాము దాంట్లో ఓ గెస్ట్ చాలాసేపట్నించీ మాట్లాడుతుంటుంటాడు అప్పుడు హోస్ట్ వచ్చి ఓ ప్రశ్న అడుగుతాడు ఆ ప్రశ్న గాల్లోంచి వచ్చినట్లు వుంటుంది లేదా జవాబు ఇచ్చేసినదయ్యి ఉంటుంది. దానర్థం హోస్టే ఎప్పుడో వినడం ఆపేసివుంటాడు కారణం అతను ఇది తెలివైన ప్రశ్న అనుకొంటాడు ఈ ప్రశ్న వేయాలని నిశ్చయించుకుని వుంటాడు మనమూ సరిగ్గా ఇలానే చేస్తాం మనమక్కడ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నామని అనుకుంటాం ఆ సమయంలో Hugh Jackmanను కాఫీ షాపులో కలిసినట్లు గుర్తుకొస్తుంది ( నవ్వులు ) వినడం ఆపేస్తాం కథలు, ఐడియాలు మీ దగ్గర కొస్తాయి వాటి రాకపోకలు మీ కవసరం ఐదవది: మీకు తెలియకుంటే తెలీదని చెప్పండి ఇప్పుడు రేడియోలో ముఖ్యంగా NPR లు వాళ్ళకి తెలుసు రికార్డ్ చేయడానికెళ్తున్నట్లు వాళ్లు ప్రవీణులమని చెప్పిన విషయాలపట్ల జాగ్రత్తగా వుండాలి చెప్పే విషయాల గురించి ఖచ్చితంగా తెలిసుండాలి అదే చేయండి.తప్పులు రాకుండా జాగ్రత్తపడండి ప్రసంగాలు చీప్ గా ఉండరాదు ఆరవది: మీ అనుభవాల్ని ఇతరులవాటితో పోల్చకండి వాళ్లు చనిపోయిన కుటుంబసభ్యుని గురించి మాట్లాడుతుంటే మీకు జరిగిన అలాంటి సంఘటనను గూర్చి మాట్లాడకండి వారి ఉద్యోగ సమస్యలను గూర్చి మాట్లాడుతుంటే మీ ఉద్యోగాన్ని ఎంతగా ద్వేషిస్తున్నారో ఏకరువుపెట్టకండి ఇవి ఒకటికావు.ఎప్పుడూ కాలేవు ప్రతి అనుభవమూ వ్యక్తిగతమైనదే మరీ ముఖ్యంగా అది మీ గురించికాదు మీరెంత గొప్పవారో అప్పుడు నిరూపించాల్సిన అవసరం లేదు లేదా మీరెన్ని బాథలు అనుభవించారో ఓ సారి Stephen Hawking ను అతని IQ ఎంతని ఎవరోఅడిగారు ఆయనన్నాడు "నాకూ తెలీదు.దాని గురించి గొప్పలు చెప్పేవాళ్లు ఎంతో కోల్పోతారు" ( నవ్వులు ) సంభాషణలు ఎదిగే నిచ్చెనలు కావు ఏడవది మీరోసారి చెప్పింది మళ్లీ చెప్పకండి అది మీస్థాయిని దిగజార్చుతుంది. బోర్ కొట్టిస్తుంది మనం అలా చాలాసార్లు చేస్తాం ముఖ్యంగా ఆఫీస్ సంభాషణల్లో, పిల్లలతో మాట్లాడేటప్పుడు మనమో అంశాన్ని వివరించాలనుకున్నాం అందుకని మళ్ళీ మళ్లీ చెప్తాం అలా చేయకండి ఎనిమిదవది: దుష్టులకు దూరంగా వుండండి వాస్తవానికి ప్రజలు లక్ష్యపెట్టరు సంవత్సరాలు, పేర్లు తేదీలవంటి వివరాలు మీరు మీ జ్ఞాపకాల్తో కుస్తీపడుతున్నారు వారు శ్రధ్ద చూపేది మీగురించే వాటికోసం కాదు మీరు ఎలాంటి వారో మీలో వారిలో వున్న సాధారణ లక్షణాలేన్టో తెలుసుకోవాలనుకుంటారు కనుక ఆ చిన్నచిన్న వివరాలను వదిలేయండి తొమ్మిదవది ఇది చివరిది కాదు కానీ చాలా ముఖ్యమైంది వినండి దీన్ని ఎందరు ప్రముఖులు చెప్పారో చెప్పలేను వినడం అనేది చాలా ముఖ్యమైన మొదటి నైపుణ్యం దాన్ని అభివృధ్ధి చేసుకోండి బుధ్ధుడు చెప్పినదానిని తిరిగి చెప్తున్నాను నోరు తెరిచారంటే దానర్థం మీరు నేర్చుకోవడం లేదని Calvin Coolidge ఇలా అన్నాడు "బాగా వినే శ్రోత ఎప్పుడూ చెడిపోడు." ( నవ్వులు ) మనం ఒకళ్ళ మాట మరొకళ్లం ఎందుకు వినడం లేదు? మొదటిది, వాస్తవానికి మనం మాట్లాడాలనుకుంటాం నేను మాట్లాడుతుంటే సంయమనంతో వుంటాను నాకాసక్తి లేనిదేదీ నే వినాల్సిన అవసరం లేదు అందరి దృష్టీ నా మీదే వుంది నా స్వంత గుర్తింపును పెంచుకోగలను ఇంకో కారణం కూడా వుంది మనం అన్యమనస్కులమౌతాము సగటు మనిషి నిముషాన్కి 225 మాటలు మాట్లాడుతాడు కానీ మనం నిముషాన్కి 500 పదాలవరకు వినగలం అలా మనస్సు ను మిగిలిన 275 పదాలతో నింపగలం నాకు తెలుసు ఎవరిపైనైనా శ్రధ్ద చూపడానికి ప్రయత్నం, శక్తి కావాలి. కానీ అలా చేయకుంటే మీరు సంభాషణలో పాల్గొన్నట్లు కాదు అది ఒకే ప్రదేశంలో కేవలం ఇద్దరు మనుష్యులు వాక్యాల రూపంలో అరుస్తున్నట్లు. ( నవ్వులు ) మనం పరస్పరం వినాలి దీన్నే స్టీఫెన్ కోవే చాలా అందంగా చెప్పాడు "మనలో చాలామంది అర్థం చేసుకోవాలనే ఉద్యేశం తో వినరు బదులివ్వాలనే ఉద్యేశంతోనే వింటాం" రూల్ పది: అదేంటంటే క్లుప్తంగా చెప్పు మంచి సంభాషణ మినిస్కర్ట్ వంటిది ఆసక్తి రేపేంత పొట్టిదిగా వుండాలి కానీ విషయాన్ని దాచేంత పొడుగ్గానూ వుండాలి ( నవ్వులు ) (కరతాళధ్వనులు ) ఇప్పుడు చెప్పిందంతా క్రోడీకరిస్తే ఒకే ముఖ్యాంశం అదేంటంటే ఇతరులపట్ల ఆసక్తి కలిగివుండు మీకుతెలుసు నేను చాలా ప్రసిధ్ధులైన తాతగారివద్ద పెరిగాను మా ఇంట్లో ఓ సంప్రదాయముండేది మా గ్రాండ్ పేరంట్స్ తో మాట్లాడటానికి జనం వస్తుండేవారు వాళ్లు వెళ్ళాక అమ్మ మా వద్దకు వచ్చేది "వాళ్ళెవరో మీకు తెలుసా" అని అడిగేది Miss America పోటీలో రెండవస్థానం ఆమెదే ఆయన సాక్రమాంటో మేయర్ ఆమె పులిట్జర్ బహుమతి పొందింది ఆయన రష్యన్ బాలే కళాకారుడు నేను ఎలాంటి అంచనాలతో పెరిగానంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ప్రత్యేకత దాగివుంటుంది నిజాయితీగా అదే నన్ను గొప్ప హోస్ట్ ను చేసిందనుకుంటాను సాధ్యమైనంతవరకు నా నోటిని మూసివుంచుతాను నా మనస్సును తెరచి వుంచుతాను సదా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుంటాను అలా నేనెప్పుడూ నిరాశచెందలేదు మీరూ అలానే చేయండి బయటికి వెళ్లండి.జనాల్తో మాట్లాడండి వారు చెప్పేది వినండి ముఖ్యంగా ఆశ్చర్యపోడానికి సిధ్ధంగా వుండండి కృతజ్ఞతలు ( కరతాళధ్వనులు )